తెలుగు సినిమా కీర్తిపతాకం రెపరెపలాడుతోంది.. అవార్డు విన్నర్స్‌కి ఎన్టీఆర్ ప్రశంస

Recommended Video

Jr NTR Wishes To 66th National Film Award Winners || Filmibeat Telugu

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే జాతీయ చలన చిత్ర అవార్డు విజేతల వివరాలు ఈ రోజు ప్రకటించబడ్డాయి. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు ప్రకటించారు. నిజానికి ఈ 66వ చలన చిత్ర అవార్డులు ఏప్రిల్ నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా 2019 లోక్ సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది.

దక్షిణాది చిత్రాల హవా

దక్షిణాది చిత్రాల హవా

కేంద్ర ప్రభుత్వం తాజాగా 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పలు దక్షిణాది చిత్రాల హవా కొనసాగింది. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి తెలుగు, కన్నడ చిత్రసీమలకు చెందిన సినిమాలు సత్తా చాటాయి. ఈ మేరకు ఆయా చిత్రసీమల్లోని పలువురు ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో టాలీవుడ్ జోష్..

66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో టాలీవుడ్ జోష్..

66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో టాలీవుడ్ జోష్ కనిపించింది. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా ఉత్తమ చిత్రంగా సెలెక్ట్ కాగా, అదే సినిమాకు గాను ఉత్తమ హీరోయిన్ కేటగిరీలో కీర్తి సురేష్ అవార్డు దక్కించుకుంది. ఇక రంగస్థలం, చిలసౌ, అ! చిత్రాలు ఇతర వేరు వేరు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకున్నాయి.

అవార్డు విన్నర్స్‌కి ఎన్టీఆర్ ప్రశంస

టాలీవుడ్ చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం పట్ల సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవార్డు విన్నర్స్‌‌ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ''తెలుగు సినిమా కీర్తిపతాకం రెపరెపలాడుతోంది.. మహానటి, రంగస్థలం, అ!, చి ల సౌ చిత్రాల యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు'' అని ఆ ట్వీట్‌లో తెలిపారు.

 రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్

రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్

ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి భారీ మల్టీస్టారర్ సినిమా RRRలో నటిస్తున్నారు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెలుకుతున్న ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2020 జులై 30వ తేదీన విడుదల కానుంది.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా

మరోవైపు 66వ జాతీయ చలన చిత్ర అవార్డులకు సెలెక్ట్ అయిన చిత్రాలను, ఆ యూనిట్ సభ్యులను మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఇంకా ఎందరో టాలీవుడ్ ప్రముఖులు అవార్డు విన్నర్స్‌ని అభినందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X