నా బంగారు తల్లి నిర్మాతకు ఇంటర్నేషనల్ అవార్డ్
హైదరాబాద్: ప్రజ్వల సమర్పణలో సన్ టచ్ ప్రొడక్షన్స్ పతాకంపై సునీతకృష్ణన్, ఎం.ఎస్. రాజేష్ నిర్మించిన చిత్రం 'నా బంగారు తల్లి'. అంజలి పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్నశేఖర్ తదితరరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఈ చిత్రానకి 3 జాతీయ అవార్డులు వచ్చాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాత సునిత కృష్ణన్ మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. నవంబర్ 24, 2014న సౌతాఫ్రికాలోని జోహన్నస్ బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో నెల్సన్ మండేలా-గ్రాకామాచెల్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఆసియా మహిళ సునీత కృష్ణన్ కావడం విశేషం. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొందుకుగాను ఆమెకు ఈ అవార్డు అందజేసారు.

‘నా బంగారు తల్లి' సినిమా విషయానికొస్తే...‘‘ఇది అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపే ‘హ్యూమన్ ట్రాఫికింగ్' నేపథ్యంలో తీసిన సినిమా అయినా ఎలాంటి అసభ్యతకూ, అశ్లీలతకూ చోటు లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేవిధంగా దర్శకుడు రూపొందించారు. ఇది ఓ తండ్రీ కూతుళ్ల అందమైన అనుబంధాన్ని చాటిచెప్పే చిత్రం.
నిజ జీవిత సంఘటనలను ఆధారం చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా నిర్మాణానికి మా ఇంటిని కూడా తాకట్టు పెట్టాం. ఇందులోని తండ్రీ కూతుళ్ల పాత్రల కోసం తెలుగు చిత్రసీమలోని పలువురిని సంప్రదించినా, చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మహారాష్ట్ర అమ్మాయి అంజలీ పాటిల్, పేరుపొందిన మలయాళ నటుడు సిద్దిఖ్ ఆ పాత్రలను చేశారు. ప్రఖ్యాత గాయని శ్రేయా ఘోషల్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇందులో పాటలు పాడారు అని నిర్మాత తెలిపారు.


Click it and Unblock the Notifications











