twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బంగారు తల్లి నిర్మాతకు ఇంటర్నేషనల్ అవార్డ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రజ్వల సమర్పణలో సన్ టచ్ ప్రొడక్షన్స్ పతాకంపై సునీతకృష్ణన్, ఎం.ఎస్. రాజేష్ నిర్మించిన చిత్రం 'నా బంగారు తల్లి'. అంజలి పాటిల్, సిద్ధిఖీ, లక్ష్మీమీనన్, రత్నశేఖర్ తదితరరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు.

    ఇప్పటికే ఈ చిత్రానకి 3 జాతీయ అవార్డులు వచ్చాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాత సునిత కృష్ణన్ మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. నవంబర్ 24, 2014న సౌతాఫ్రికాలోని జోహన్నస్ బర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో నెల్సన్ మండేలా-గ్రాకామాచెల్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఆసియా మహిళ సునీత కృష్ణన్ కావడం విశేషం. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొందుకుగాను ఆమెకు ఈ అవార్డు అందజేసారు.

    Naa Bangaaru Talli Producer Gets International Award

    ‘నా బంగారు తల్లి' సినిమా విషయానికొస్తే...‘‘ఇది అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపే ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌' నేపథ్యంలో తీసిన సినిమా అయినా ఎలాంటి అసభ్యతకూ, అశ్లీలతకూ చోటు లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేవిధంగా దర్శకుడు రూపొందించారు. ఇది ఓ తండ్రీ కూతుళ్ల అందమైన అనుబంధాన్ని చాటిచెప్పే చిత్రం.

    నిజ జీవిత సంఘటనలను ఆధారం చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా నిర్మాణానికి మా ఇంటిని కూడా తాకట్టు పెట్టాం. ఇందులోని తండ్రీ కూతుళ్ల పాత్రల కోసం తెలుగు చిత్రసీమలోని పలువురిని సంప్రదించినా, చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మహారాష్ట్ర అమ్మాయి అంజలీ పాటిల్‌, పేరుపొందిన మలయాళ నటుడు సిద్దిఖ్‌ ఆ పాత్రలను చేశారు. ప్రఖ్యాత గాయని శ్రేయా ఘోషల్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇందులో పాటలు పాడారు అని నిర్మాత తెలిపారు.

    English summary
    NAA BANGAARU TALLI Producer Dr. Sunitha Krishnan Receiving the Nelson Mandela-Graca Machel Award at Johannesburg.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X