డబ్బే ముఖ్యం, అది లేక చాలా కష్టపడ్డా, సొల్లు మాటలు నమ్మొద్దు: నాగబాబు

Recommended Video

Naga Babu Reveals His Financial Problems And Struggles || Filmibeat Telugu

డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. జీవితం అనే బండి నడవాలంటే ధనం కావాలి అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. 'నా ఛానల్ నా ఇష్టం' యూట్యూబ్ ఛానల్‌లో తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. డబ్బు లేక ఒకప్పుడు తాను ఎంత కష్టపడ్డానో వివరించే ప్రయత్నం చేశారు.

చాలా మంది మనకున్న పెద్ద సమస్య డబ్బే అని చెబుతుంటారు, కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు.. దాన్ని మించినవి చాలా ఉంటాయనే కథలు చెబుతుంటారు. అన్ని మతాల్లోనూ డబ్బు సెకండరీ, వ్యక్తిత్వం ముఖ్యం అనే మాటలు మాట్లాడుతుంటారు. కానీ నేను మాత్రం డబ్బే ముఖ్యమని నమ్ముతాననని నాగబాబు స్పష్టం చేశారు.

తప్పకుండా ప్రతి మనిషీ డబ్బు సంపాదించి తీరాలి

తప్పకుండా ప్రతి మనిషీ డబ్బు సంపాదించి తీరాలి

మన చేతిలో కత్తి ఉంటే కూరగాయలు కోయడానికి పని చేస్తుంది, మనుషులను చంపడానికి పని చేస్తుంది. డబ్బు కూడా అంతే. కానీ డబ్బే చెడ్డది అంటే అంతకంటే ఫూలిష్‌నెస్ ఏమీ లేదు. తప్పకుండా ప్రతి మనిషీ డబ్బు సంపాదించి తీరాలి. మన వద్ద డబ్బు లేకుంటే ఏమీ చేయలేమని నాగబాబు అభిప్రాయ పడ్డారు.

నాకు 49 ఏళ్ల వయసులో డబ్బు విలువ తెలిసింది

నాకు 49 ఏళ్ల వయసులో డబ్బు విలువ తెలిసింది


నేను డబ్బు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు 49 ఏళ్ల వయసులో డబ్బు విలువ తెలిసింది. అప్పటిదాకా డబ్బు దుర్వినియోగం చేయక పోవచ్చుకానీ డబ్బు సంపాదించాలనే కసి ఉండేది కాదు. ది రిచ్చెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోనియా అనే బుక్ చదివితే మీకూ డబ్బు ఎందుకు సంపాదించాలి, ఎలా ఉపయోగపడుతుందనే విషయం అర్థమవుతుందని మెగాబ్రదర్ సూచించారు.

డబ్బు ఉన్నవాడే బలవంతుడు

డబ్బు ఉన్నవాడే బలవంతుడు


ఒకసారి మీరు ప్రొఫెషనల్ లైఫ్‌లోకి ఎంటరైన తర్వాత సేవింగ్స్ గురించి ఆలోచించాలి. వారన్ బఫెట్ చెప్పినట్లు సేవింగ్స్ చేయగా మిగిలింది ఖర్చు పెట్టాలి. నాకు డబ్బు విలువ తెలిసిన తర్వాత చాలా జాగ్రత్త పడ్డాను. సేవ్ చేశాను. ఈ రోజు డబ్బు ఉన్నవాడే బలవంతుడని తెలిపారు.

ఆ సొల్లు మాటలు నమ్మొద్దు

ఆ సొల్లు మాటలు నమ్మొద్దు

‘మనీ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్' అనే సొల్లు మాటలు నమ్మొద్దు. అన్ని మతాల్లోనూ ఇలాంటి మాటలు చెబుతారు. మతాలకు హెడ్స్‌గా ఉండే అందరికీ డబ్బు కావాలి. మిగతా వారికి మాత్రం డబ్బు తుచ్ఛమైనది అని చెబుతుంటారు. అందుకే ఇవన్నీ నేను నమ్మనని స్పష్టం చేశారు.

కూర్చుని ఏడిస్తే ఏమీ ఉపయోగం?

కూర్చుని ఏడిస్తే ఏమీ ఉపయోగం?

నువ్వు డబ్బు సంపాదించినపుడే ఇంకొకరికి సహాయం చేయగలం. ఎవరికైనా కష్టం వచ్చినపుడు అయ్యోబాబు ఇలా అయిందా? అని అతడితో కూర్చుని ఏడిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. పక్కోడి కష్టం చూసి నువ్వు కూడా ఏడిస్తే అతడి పెయిన్ మరింత పెరుగుతుందే తప్ప తగ్గుదు. నువ్వు ఏమైనా సహాయం చేస్తే అతడి బాధ తగ్గుతుంది. అందుకే డబ్బు ఎలా సంపాదించాలనే జ్ఞానం ప్రతి ఒక్కరూ సంపాదించాలని నాగబాబు సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X