twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ 'నా ఇష్టం' పుస్తకావిష్కరణ ఎప్పుడు ..ఎక్కడ

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ తెలుగులో రాసిన నా ఇష్టం పుస్తకం..డిసెంబర్ ఒకటవ తేదీన సాయింత్రం ఆరున్నరకి లాంచ్ కానుంది. హైదరాబాద్ లోని తాజ్ బంజారా లాన్స్ లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. ఈ విషయమై వర్మ ట్వీట్ చేస్తూ...నేను నా మొదటి సినిమా విడుదల అయ్యేటప్పుడు కూడా ఇంత ధ్రిల్ ఫీలవలేదు అన్నారు. ఈ పుస్తకాన్ని ఎమెస్కో వారు పబ్లిష్ చేస్తున్నారు. వారే ఈపుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక ఈ పుస్కకావిష్కరణకు దగ్గుపాటి రానా ఆనందం వ్యక్తం చేస్తూ ఇలా ట్వీట్ చేసారు.. మీ ఆలోచనలు, పుస్తకం రూపంలో తెలుగులో వస్తున్నందకు హ్యాపీగా ఉంది అన్నారు. దానికి వర్మ..నువ్వు చదవవని తెలుసు అయినా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తాను అన్నారు. తనను విమర్శించే వారికి నా ఇష్టం పుస్తకం ఓ సమాధానం అని ఆయన చెబుతున్నాడు. నా ఇష్టం పుస్తకంలో రాం వ్యక్తిత్వం, ఆయన చిత్ర విశేషాలు తదితరాలు ఉంటాయి. మరో విశేషమేమంటే నా ఇష్టం రచనకు కూడా సీక్వెల్ వస్తుందని చెప్పటం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X