రానా ‘నా ఇష్టం’ సెన్సార్ రిపోర్ట్

By Bojja Kumar

దగ్గుబాటి యువ హీరో రాణా 'నా ఇష్టం' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రానా సరసన జెనీలియా నటించింది. ఉగాది సందర్భంగా మార్చి 23న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

ఇక ఈ చిత్రంలో రాణా.. గణేష్ అనే స్వార్ధపరుడైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక సుకుమార్ అశోసియేట్ అయిన ప్రకాష్ తోలేటి ఈ చిత్రాన్ని ఓ అద్బుతం జరగాలి అన్నట్లుగా చెక్కాడని, గ్యారెంటీగా ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మరో సంచలనం క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ.. నవతరం కుర్రాడి ప్రేమ, జీవితం చుట్టూ అల్లుకొన్న కథ ఇది. తన గురించి మాత్రమే ఆలోచించే ఆ యువకుడిలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. దాని వెనక కారణాలేమిటనే విషయాన్ని ఆసక్తికరంగా చెబుతున్నారు దర్శకుడు. వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. యూనైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X