రాణా 'నా ఇష్టం' విడుదల తేదీ ప్రకటన

By Srikanya

రాణా, జెనీలియా కాంబినేషన్ లో రూపొందిన నా ఇష్టం చిత్రం విడుదల తేదిని ప్రకటించారు. మార్చి 23 న ఈ చిత్రం విడుదల చేస్తామని రాణా చెప్పారు. ఈ విషయమై సినీ మాక్స్ లో పెట్టిన ప్రెస్ లో రాణా మాట్లాడుతూ... మేము ఈ వారంలో మా చిత్రం మ్యూజిక్ ని విడుదల చేస్తున్నాం. మార్చి 23 న విడుదల చేస్తున్నాం అన్నారు. ఇక చక్రీ సంగీతం అందించే ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీ. సుకుమార్ శిష్యుడు తోలేటి ప్రకాష్ దర్శకత్వంలో 'నా ఇష్టం' చిత్రం రూపొందింది. దర్శకుడు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...మా చిత్రం ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ లవ్‌స్టోరి ఇది. నా తొలి సినిమాకి హీరోగా రాణా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను .

ఇక పాటల విషయానికొస్తే చక్రి గారు అద్భుతమైన 7 పాటలనిచ్చారు. 2012 లోనే టాప్‌ పొజిషన్‌లో 'నా ఇష్టం' పాటలు నిలుస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. కునాల్‌ గంజ్వాల, అద్నాన్‌ సమి, మమతా శర్మ,కె.కె, షాన్‌ వంటి పాపులర్‌ సింగర్స్‌ ఆలపించారు. 4 పాటలను ప్రతి ఒక్కరూ హమ్‌ చేసుకుంటారు. ఈ సంవత్సరం మా అందరికీ పెద్ద విజయాన్ని చేకూరుస్తుందని ఆశిస్తున్నాము అన్నారు. బ్రహ్మానందం, హర్షవర్థన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, ఆలీ, భరత్, ఉత్తేజ్, చిత్రం శ్రీను, గిరి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, జోగి బ్రదర్స్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, రచనాసహకారం: చంద్రశేఖర్, టి.రమేష్, వేమారెడ్డి, శ్రీకర్, ఫొటోగ్రఫీ: వెంకట్‌ప్రసాద్, సంగీతం: చక్రి, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ తోలేటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X