నా(కు) ఇష్టం...అందుకే వెయ్యిసార్లు తాగా

By Bojja Kumar

దగ్గుబాటి యువ హీరో రాణాకు కాఫీలంటే మహా ఇష్టం అంట. ఇప్పటి వరకు తన సినిమా షూటింగుల్లో దాదాపుగా ఓ వెయ్యి కాఫీలు తాగాడట. ఈ విషయాన్ని రాణా స్వయంగా వెల్లడించారు. తన తాజా సినిమా 'ఇష్టం' సినిమా ప్రమోషన్లో భాగంగా కాఫీ డేలో తిష్టవేసి వివిధ రకాల కాఫీలను లాగించేసిన రాణా సినిమా గురించిన పలు ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో తకిట తకిట హీరో హర్షవర్ధన్ రానె కూడా పాల్గొన్నాడు.

ఈ చిత్రంలో రాణా సరసన జెనీలియా నటించింది. ఉగాది సందర్భంగా మార్చి 23న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ చిత్రంలో రాణా.. గణేష్ అనే స్వార్ధపరుడైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక సుకుమార్ అశోసియేట్ అయిన ప్రకాష్ తోలేటి ఈ చిత్రాన్ని ఓ అద్బుతం జరగాలి అన్నట్లుగా చెక్కాడని, గ్యారెంటీగా ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మరో సంచలనం క్రియేట్ చేస్తుందని నిర్మాత పరుచూరి కిరీటి అంటున్నారు.

ఈచిత్రం తర్వాత రాణా తెలుగులో నటిస్తున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రాణా బీటెక్ బాబు పాత్రలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X