'నా ఇష్టం' అంటూ 'సింహా' నిర్మాత
వరస పరాజయాల్లో ఉన్న బాలకృష్ణకు 'సింహా' వంటి సూపర్ హిట్ చిత్రాన్నిఅందించిన యునైటెడ్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నా తాజా చిత్రం 'నా ఇష్టం'. దగ్గుబాటి రాణా, జెనీలియా జంటగా నటిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మాత. ప్రకాష్ తోలేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరిగాయి. మూడవ షెఢ్యూల్ బుధవారం నుండి హైదరాబాద్‌లో జరగుతుంది. ' నవంబర్ 5 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో హీరో హౌస్, హీరోయిన్ హౌస్‌కి సంబంధించిన సన్నివేశాలను, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ని, ఓ ఐటెం సాంగ్‌ని చిత్రీకరిస్తాం. రాణా, జెనీలియాతో పాటు ఆలీ, విజయ్, చిత్రం శ్రీను తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు' అని నిర్మాత కిరీటి చెప్పారు. ఫీల్‌గుడ్ యూత్‌ఫుల్ మూవీగా రూపొందుతున్న 'నా ఇష్టం' రాణా కెరీర్‌లో ఓ చక్కని చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు ప్రకాష్ చెప్పారు.
బ్రహ్మానందం, హర్షవర్ధన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, ఆలీ, అజయ్, భరత్, ఉత్తేజ్, శ్రీనివాసరెడ్డి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, పృథ్వీ, జోగి బ్రదర్స్ నటిస్తున్న ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, రచనా సహకారం: చంద్రశేఖర్ , టి.రమేష్, వేమారెడ్డి, శ్రీకర్, సంగీతం: చక్రి, ఫొటోగ్రఫీ: వెంకటప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.గోపాలకృష్ణ, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్ తోలేటి.


Click it and Unblock the Notifications











