కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ విడుదల వాయిదా

By Bojja Kumar

నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న రిమాంటిక్ మూవీ 'నా నువ్వే' చిత్రాన్ని మే 25న విడుదలకు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వారం ఆలస్యంగా... జూన్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేశారు. లవ్ స్టోరీ మెయిన్ ట్రాక్‌గా రొమాంటిక్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ చిత్రంలో కళ్యాణ్, రామ్, తమన్నా మధ్య జరిగే లవ్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

Naa Nuvve movie release date postponed

ఒక టోటల్ ఫ్రెష్ లుక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రం లో కనిపించబోతున్నారు. లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా గా ఉండే ఈ చిత్రం లో, కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి ప్రధాన నటులు.

ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ , ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే - జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X