ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో నా నువ్వే ప్రమోషన్స్!
వేసవిలో విడుదలైన చిత్రాలు, ఐపీఎల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ రెండూ జనాలకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ దృష్టి ఐపీఎల్ పై పడింది. రజినీకాంత్ 2.ఓ చిత్ర టీజర్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో విడుదల చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ కోసం ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజగా సమాచారం ప్రాంతం ఈ సాయంత్రం జరిగే ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో నా నువ్వే ప్రమోషన్స్ నివహించనున్నారు. ఐపీఎల్ మ్యాచ్ మా మూవీస్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మా మూవీస్ ఛానల్ లో మ్యాచ్ జరిగే సమయంలో నా నువ్వే చిత్ర ప్రచార కార్యమ్రాలు నిర్వహించబోతున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన తొలి రొమాంటిక్ చిత్రం ఇది. టీజర్, ట్రైలర్ ద్వారా కళ్యాణ్ రామ్, తమన్నా మధ్య ఈ చిత్రంలో కెమిస్ట్రీ అదిరిపోయిందనే సంగతి స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











