కార్తి 'నా పేరు శివ' విడుదల ఖరారు
కార్తి, కాజల్ జంటగా నటించిన డబ్బింగ్ చిత్రం 'నా పేరు శివ'. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా మీడియాకు తెలియచేసారు. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ ''చీకూచింతా లేకుండా సరదాగా జీవితాన్ని గడిపేసే కుర్రాడు శివ. మిడిల్ క్లాస్ కు చెందిన శివ కనే కలలు మాత్రం చాలా కాస్టలీవి. బాధ్యతలు పట్టించుకోకుండా జల్సాగా తిరుగుతుంటే శివ అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటాడు. అందులోంచి ఎలా బయటపడ్డాడు? తన బాధ్యతలను ఎలా గుర్తించాడు? అనేదే అసలు కథ.ఈ చిత్రంలో కాజల్ నటన నచ్చుతుంద అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ 'తెలుగులో విడుదలైన నా గత రెండు చిత్రాలు 'యుగానికి ఒక్కడు", 'ఆవారా" ఘనవిజయం సాధించాయి. నా నుంచి వస్తోన్న ఈ మూడవ చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా ఒక జీవితంలా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల్లో అన్నీ తక్కువగా ఉంటాయి. ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. ఈ చిత్రంలో నేను మధ్యతరగతి యువకుడిగా నటించాను. సినిమా ప్రథమార్ధం రొమాంటిక్ గా ద్వితీయార్ధం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా.


Click it and Unblock the Notifications