ఆవారా కార్తి కాదు వారెవ్వా కార్తి...!
తమిళ మార్కెట్ లోకి చొరబడడానికి మన హీరోలకి ఎంతో ఘనమైన చిత్రాలు కావాలి. అరుంధతి, మగధీర వంటి అత్యుత్తమ శ్రేణి చిత్రాలు మినహా అక్కడ అనువాదమైన తెలుగు చిత్రాలకి కాసులు రాలవు. అయితే తెలుగువారిని మెప్పించడం మాత్రం మహా ఈజీ. మన హీరోలని వింత వింత పాత్రల్లో, చిత్ర విచిత్రమైన గెటప్పుల్లో చూడ్డానికి ఇష్టపడని మన ప్రేక్షకులు అరవ హీరోలు అవే పాత్రలు చేస్తే బ్రహ్మరథం పడతారు.
అయితే అలాంటి విచిత్రాలేమీ చేయకుండా, కాళ్లూ చేతులూ సరిగా ఉండి, పూర్తి ఆరోగ్యవంతమైన పాత్రలు పోషించి కూడా తెలుగు మార్కెట్ ని కొల్లగొట్టిన కార్తికి ఇప్పుడు తెలుగునాట మంచి క్రేజ్ ఏర్పడింది. అతని తాజా చిత్రం 'నా పేరు శివ"ని భారీ స్థాయిలో విడుదల చేయగా, బ్రహ్మాండమైన ఓపెనింగ్ లభించింది. అంతే కాక తెరపై కనిపిస్తే విజల్స్ కొట్టి, పేపర్లు చింపి విసిరే అభిమానులు కూడా థియేటర్లలో దర్శనమిస్తున్నారు. అందుకు కారణం కాజల్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది..రెండే రెండు అనువా చిత్రాలతో తెలుగునాట ఇంతటి ఖ్యాతి గడించిన కార్తిని మన సినీ జనం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు...


Click it and Unblock the Notifications











