twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిలటరీ మాధవరంలో ‘నా పేరు సూర్య’ వేడుక, బన్నీ వెళ్లేది డౌటే?

    By Bojja Kumar
    |

    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య'. ఈ చిత్రంలో బన్నీ సోల్జర్‌గా కనిపించబోతున్నారు. సినిమా మొత్తం మిలటరీ ట్రైనింగ్, సరిహద్దులో సైనికులు చేసే పోరాటం లాంటి అంశాలతో తెరకెక్కుతోంది. మే 4న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్, డైలాగ్ ఇంపాక్ట్, ట్రైలర్లు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

    Naa Peru Surya

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 29న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మిలటరీ మాధవరం అనే ఊరిలో ప్లాన్ చేశారట. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో ఈ ఊరు ఉంది. ఇక్కడ ఈ వేడుక ప్లాన్ చేయడానికి ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు.

    'నా పేరు సూర్య' చిత్రంలో హీరో సోల్జర్ కావడం, మిటరీ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో........ మిలటరీ మాధవరంపై దర్శక నిర్మాతల దృష్టి పడింది. ఈ ఊరిలో ప్రతి ఇంటి నుండి ఒకరు మిలటరీలో జాయిన్ అయి దేశానికి సేవలు అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌కు ఇది మంచి ప్లేస్ అని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు బన్నీ వెళతారా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు.

    'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు, టీజర్లు సినిమాను ఓ రేంజికి తీసుకెళ్లాయి. అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. మెగా బ్రదర్ నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి లగడపాటి శిరీష్, బన్నీవాసు నిర్మిస్తున్నారు. కథా, మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

    English summary
    Stylish star Allu Arjun's upcoming movie Naa Peru Surya. Naa Illu India is all set to hit the theatres on May 4th. The team has been participating actively in the promotions of the movie. Now, they are going to organise an event in military Madhavaram village in West Godavari district.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X