For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ కెరీర్లో ఇది హై ఓల్టేజ్: ‘నా పేరు సూర్య’పై నాగబాబు కామెంట్

    By Bojja Kumar
    |
    "Naa Peru Surya" Is A Different Film In Allu Ajun Career

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. నవంబర్ 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు. ఈ సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

    నవంబర్ నుండి హైదరాబాద్ లో షూటింగ్

    నవంబర్ నుండి హైదరాబాద్ లో షూటింగ్

    నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" నవంబర్ 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు... అని తెలిపారు.

     2018 ఏప్రిల్ 27న సినిమా రిలీజ్

    2018 ఏప్రిల్ 27న సినిమా రిలీజ్

    అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణుల‌తో చిత్రాన్ని ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రీక‌రిస్తున్నాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.

     బన్నీ కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ : నాగబాబు

    బన్నీ కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ : నాగబాబు

    చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ... బన్నీ కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనం తో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడు. నవంబర్ 5 నుంచి నెల రోజుల పాటు హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 27, 2018 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని అన్నారు.

     బన్నీ వాసు మాట్లాడుతూ...

    బన్నీ వాసు మాట్లాడుతూ...

    సహ నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ కి ఏప్రిల్ 27, 2018 పెద్ద పండగ చేసుకునే రోజు. ఆ రోజు అత్యధిక థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదల చేస్తున్నాం. వక్కంతం వంశీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. నవంబర్ 5 నుంచి మరో కీలక మైన షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాం. అని అన్నారు.

     తారాగణం

    తారాగణం

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

    సాంకేతిక నిపుణులు

    ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)

    ఫైట్స్ - రామ్ లక్ష్మణ్

    సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి

    ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్

    సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి

    సంగీతం - విశాల్ - శేఖర్

    ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్

    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు

    బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్

    సమర్పణ - k.నాగబాబు

    సహ నిర్మాత - బన్నీ వాసు

    నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి

    రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

    English summary
    The regular shooting of 'Na Peru Surya' will re-commence in Hyderabad from Nov 5. Naa Peru Surya is a 2018 Telugu language patriotic action film produced by Sirisha and Sridhar Lagadapati under Ramalakshmi Cine Creations banner, written and directed by Vakkantham Vamsi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X