‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాల రేంజ్‌లో నాపేరు సూర్య ఉంటుది, నిర్మాత లగడపాటి శ్రీధర్
అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదలకు రంగం సిద్ధం అయిపోతోంది. ప్రచార కార్యక్రమాలు కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 29న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. చరణ్ ఈ వేడుకకు అతిథిగా హాజరు కాబోతున్నాడు.
తాజాగా ఈ సినిమాకు గురించి చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ''దేశం మనకేం చేసింది అన్నది కాదు.. దేశానికి మనం ఏం చేశాం అన్నది ముఖ్యం అనే పాయింట్‌తో 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' ఉంటుంది. ప్రతి పౌరుడికి ఈ సినిమా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. దేశానికి సేవ చేయాలనుకునే హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది సినిమాలో ఆసక్తికరమని ఆయన చెప్పారు.

'రంగస్థలం, భరత్ అనే నేను' సినిమాల రేంజ్‌లో మా సినిమా కూడా ఉంటుందని నా నమ్మకం'' నా పేరు సూర్య ఎవ్వరిని నిరాశ పరచడాని నేను హామీ ఇస్తున్నానని నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పడం జరిగింది. మే 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











