twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ కేక : ‘నా పేరు సూర్య’ ఫస్ట్ ఇంపాక్ట్ (టీజర్)

    By Bojja Kumar
    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ విడుదల చేశారు. ఇందులో బన్నీ హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ కేక పుట్టించే విధంగా ఉంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

     సోల్జర్‌గా బన్నీ

    సోల్జర్‌గా బన్నీ

    ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ సోల్జర్‌గా కనిపించనున్నారు. కోపం ఎక్కువగా ఉండే సైనికుడి పాత్రలో బన్నీ పెర్ఫార్మెన్స్ సినిమాలో హైలెట్ అయ్యే విధంగా ఉంది. బన్నీ కెరీర్లోనే ఈ చిత్రం స్పెషల్ మూవీ కాబోతోంది.

     ముఖ్య పాత్రల్లో అర్జున్, శరత్ కుమార్

    ముఖ్య పాత్రల్లో అర్జున్, శరత్ కుమార్

    ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

    బన్నీ యాక్షన్, వంశీ డైరెక్షన్ అదుర్స్

    బన్నీ యాక్షన్, వంశీ డైరెక్షన్ అదుర్స్

    చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగబాబు మాట్లాడుతూ... బన్నీ కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నిలుస్తుందని, దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనం తో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడు అని తెలిపారు.

    బోమన్ ఇరానీ

    బోమన్ ఇరానీ

    ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ బన్నీ సుపీరియర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉండనుంది.

    రిస్క్ అన్నారు... కానీ బన్నీకి తెలుసు

    రిస్క్ అన్నారు... కానీ బన్నీకి తెలుసు

    వక్కతం వంశీకి కథలు రాసే టాలెంటు మాత్రమే ఉంది. అతడికి దర్శకత్వం చేసే టాలెంటు లేదని, ఇది రిస్కే అని... ఈ సినిమా ఒప్పుకునే ముందు బన్నిని కొందరు హెచ్చరించారు. అయితే టీజర్ విడుదలైన తర్వాత వక్కతం వంశీ మేకింగ్ మీద అందరికీ నమ్మకం పెరిగింది.

    తారాగణం, తెర వెనక

    ఈ చిత్రంలో అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం - విశాల్ - శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు, బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

    English summary
    Naa Peru Surya Naa Illu India First Impact/Teaser released. Starring Allu Arjun, Anu Emmanuel. Music By Vishal–Shekhar, Directed By Vakkantham Vamsi & Produced By Sirisha Sridhar Lagadapati & Bunny Vas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X