twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్..

    |

    Recommended Video

    Naa Peru Surya Teaser !

    పట్టరాని కోపం.. నిగ్రహించుకోలేనంత ఆవేశం.. దేశం కోసం ఎంతకైనా సిద్దమన్న తెగింపు.. ఇవన్నీ ఒకే క్యారెక్టర్‌లో ఫ్రేమ్ అయితే ఎలా ఉంటుందో.. నా పేరు సూర్యలో అల్లు అర్జున్ పాత్ర అలా ఉండబోతుంది.
    హైఓల్టేజ్‌కు పక్కా డెఫినిషన్ ఇచ్చేలా వక్కంతం వంశీ హీరో క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.

     నిప్పు లాంటి క్యారెక్టర్:

    నిప్పు లాంటి క్యారెక్టర్:

    టచ్ చేస్తే చాలు.. ఎక్కడ భగ్గుమంటాడో అన్న లెవల్‌లో అల్లు అర్జున్ హావభావాలు కనిపించాయి. అదొక్కటేనా.. పాత్ర కోసం అల్లు అర్జున్ ఎంతలా కష్టపడ్డాడో ఫస్ట్ ఇంపాక్ట్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ నిజంగానే బ్లడ్ పెట్టి పనిచేశాడనడంలో అతిశయోక్తి లేదేమో!

    టెంపర్‌ను మించిన టెంపర్:

    టెంపర్‌ను మించిన టెంపర్:

    యాంగ్రీ యంగ్ మ్యాన్ తరహా పాత్రకు కరెక్ట్ ట్రీట్‌మెంట్ ఇస్తే.. వెండితెరపై అదెంతలా పేలుతుందో గతేడాది వచ్చిన అర్జున్ రెడ్డి నిరూపించింది. ఇదే కంటెంట్‌తో గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడొస్తున్న అల్లు అర్జున్ 'నా పేరు సూర్య'కు కూడా దర్శకుడు వక్కంతం వంశీ హైఓల్టేజీ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

     కొత్త యాంగిల్..:

    కొత్త యాంగిల్..:

    ఇప్పటివరకు చాలామంది దర్శకులు అల్లు అర్జున్‌ను కామెడీ యాంగిల్ లోనే ఎక్కువగా చూపించారు. కామెడీ, యాక్షన్ మిక్స్ చేసి చూపించినప్పటికీ.. అల్లు అర్జున్ అంటే కామెడీ ఎక్స్‌పెక్ట్ చేయడం కామన్ అయిపోయింది.

    కానీ ఈ సినిమాతో మొత్తం సీన్ మారిపోయే అవకాశం ఉంది.
    అల్లు అర్జున్‌లో ఇలాంటి యాంగిల్ కూడా ఒకటుందా? అనుకునేలా దర్శకుడు వక్కంతం వంశీ హీరో పాత్రను తీర్చిదిద్దాడు.

     టేకింగ్ సూపర్బ్..:

    టేకింగ్ సూపర్బ్..:

    దర్శకుడు వక్కంతం వంశీకి ఇది తొలి సినిమాయే అయినప్పటికీ.. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కిస్తున్నాడనే చెప్పాలి. ఫస్ట్ ఇంపాక్ట్‌లో అతని టేకింగ్ అద్భుతంగా కనిపించింది. అల్లు అర్జున్ నుంచి ఇంతవరకు ఎవరూ రాబట్టని ఔట్ పుట్ ను ఆయన రాబట్టారనే చెప్పాలి.

     అల్లుకు 'బిగ్ బ్రేక్' పక్కా?:

    అల్లుకు 'బిగ్ బ్రేక్' పక్కా?:

    'నా పేరు సూర్య' అల్లు అర్జున్ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందనే టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే ఇంతలా ఇంపాక్ట్ చేయడం వక్కంతం వంశీ గొప్పతనమే అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌కు కథ వినిపించాలనుకునే దర్శకులు కూడా.. పాత మూస ధోరణిలో కాకుండా డిఫరెంట్ కథలతో ఆయన వద్దకు 'క్యూ' కట్టేస్తారేమో!..

    English summary
    The teaser gives away a few things about Surya’s character. First, he is angry. Second, he is always angry. Third, he is ready to die for the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X