twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి.. నా పేరు సూర్య టీజర్‌లో అల్లు అర్జున్ ఫైర్

    By Rajababu
    |

    Recommended Video

    కోపం వచ్చినప్పుడు బూతులే వస్తాయి.. నా పేరు సూర్య.. టీజర్‌

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మే 4 రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఇటీవల ఈ చిత్ర ప్రీరిలీజ్‌ను గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం అనే గ్రామంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

    బిర్యానీ తినేలోపు చంపేస్తాను..

    జైలుగదిలో తీవ్రవాదితో ఇదే నీ ఆఖరి బిర్యానీ. బిర్యానీ తినేంతలోపు నిన్ను చంపేస్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ థ్రిల్లింగ్ ఉన్నాయి. అల్లు అర్జున్‌తో నీవు అవుటాఫ్ ఆర్డర్ సూర్య. అవుటాఫ్ ఆర్డర్ అంటే అవుటాఫ్ ఆర్మీ అని అర్థం అంటూ బోమన్ ఇరానీ చెప్పిన డైలాగ్స్ ఉద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి.

    అర్జున్ ఎమోషనల్ డైలాగ్స్

    అర్జున్ ఎమోషనల్ డైలాగ్స్

    ఒక మనిషి సమాజంలో బతకాలంటే.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కెరీర్, లవ్ ఇవన్నీ కలిసి ఉండాలి అని సీనియర్ నటుడు అర్జున్ చేత చెప్పించిన ఆలోచింపజేసేలా ఉన్నాయి.

    క్యారెక్టర్ వదిలేయడం అంటే

    క్యారెక్టర్ వదిలేయడం అంటే

    నాకు కోపం వచ్చినప్పడు బూతులే వస్తాయి.. మంత్రాలు రావు. క్యారెక్టర్ వదిలేయడం అంటే ప్రాణాలు వదిలేయడమే. చావు రాకముందు చచ్చిపోవడమే అని టీజర్‌లో స్టైలిష్ స్టార్ ఫైర్ అయ్యాడు.

    నాకు ఇండియా కావాలి.. ఇచ్చేయ్

    నాకు ఇండియా కావాలి.. ఇచ్చేయ్

    నాకు ఇండియా కావాలి.. ఇచ్చేయ్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్.. యాక్షన్ సీన్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. టీజర్‌తోనే ఉద్వేగానికి గురిచేసిన అల్లు అర్జున్.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

    English summary
    Allu Arjun's Naa Peru Surya Naa Illu India teaser released. Emotional, Patriotic content, family bonding are the key elements in the teaser. Allu Arjun fire moments grabs attention.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X