‘నా పేరు సూర్య’.....టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్, ఫస్ట్ రిపోర్ట్స్ అదిరిపోయాయి!
Recommended Video

తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు రావడం, రంగస్థలం, భరత్ అనే నేను వరుసగా రూ. 200 కోట్ల వసూళ్లు సాధించడంపై పొరుగు సినీ ఇండస్ట్రీల్లో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో సినిమా కూడా చేరబోతోంది అనే చర్చ సాగుతోంది. ఆ సినిమా మరేదో కాదు... అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ఆడియో, పోస్టర్లకు భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫస్ట్ రిపోర్ట్స్ అదిరిపోయాయి
‘నా పేరు సూర్య' సినిమాకు సంబంధించి సర్వత్రా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. సెన్సార్ కాపీ చూసిన వారంతా ‘రంగస్థలం', ‘భరత్ అనే నేను' స్థాయిలో ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఎవర్సీస్ సెన్సార్ బోర్డులో చూసిన ఉమైర్ సంధు కూడా.... టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందని తెలిపారు.

అల్లు అర్జున్ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్
గతంలో ఏ సినిమాకు కష్టపడనంతగా అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం కష్టపడ్డారు. సినిమా కథతో పాటు అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలవబోతోంది. డాన్సులు, ఫైట్స్ చేయడంలో బన్నీది ప్రత్చేక స్టైల్. ఈ చిత్రంలో బన్నీ చేసే విన్యాసాలు ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకోనున్నాయి.

ప్రేక్షకుల హార్ట్ టచ్ చేసే అంశాలెన్నో
ఈ మూవీలో అల్లు అర్జున్ ఆర్మీ జవాన్ పాత్రలో కనిపించబోతున్నారు. తన కోపంతో చేసిన కొన్ని పనుల వల్ల ఆర్మీ నుండి ఔట్ అయిన హీరో..... మళ్లీ ఆర్మీలో చేరడానికి ఏం చేశాడు అనేది సినిమాలో హైలెట్ కానుంది. చనిపోతే దేశం కోసం బోర్డర్లోనే చావాలి అనే హీరో దేశభక్తి ప్రేక్షకుల హార్ట్ టచ్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు.

సైనికులపై గౌరవం మరింత పెరిగేలా
కోట్లాది మంది ప్రజలను కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బోర్డల్లో పోరాడుతుంటారు సైనికులు. వారిపై గౌరవం మరింత పెంచే విధంగా ‘నా పేరు సూర్య' సినిమా ఉండబోతోందని అంటున్నారు.

నా పేరు సూర్య
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మే 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











