Don't Miss!
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
వారి కోసం స్పెషల్‌గా ప్లాన్ చేసిన బన్నీ!
అల్లు అర్జున్ నటించిన తాజగా చిత్రం నాపేరు సూర్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ మాన్ గా నటించిన సంగతి తెలిసిందే. మిలటరీ అధికారి పాత్రలో అల్లు అర్జున్ నటన అదుర్స్ అనిపించే విధంగా ఉంది. బన్నీ తనపాత్రలో ఒదిగిపోయి నటించాడని అంతా ప్రశంసిస్తున్నారు.
చిత్రానికి మంచి స్పందన వస్తుండడంతో పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ వేగం పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది. హైదరాబాద్ లోని మాజీ ఆర్మీ అధికారుల కోసం నా పేరు సూర్య చిత్ర యూనిట్ స్పెషల్ షోని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.
ఆర్మీ నేపథ్యంలో చిత్రం కావడంతో ఆ దిశగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఈ చిత్ర ఆడియో వేడుకని మిలిటరీ మాధవరంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ నాగబాబు సమర్పించారు. వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.