అల్లు అర్జున్ సంచలన నిర్ణయం: ఆర్మీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటన!
Recommended Video

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్మీ బ్యాక్ డ్రాపుతో 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' సినిమా చేసిన ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆర్మీ అఫీషియల్స్ కోసం ప్రసాద్ లాబ్స్‌లో ఈ మూవీ స్పెషల్ షో ప్రదర్శించిన సందర్భంగా హాజరైన స్టైలిష్ స్టార్ తన మనసులోని మాట బయట పెట్టారు. తనకు ఆర్మీలో అవకాశం కల్పించాలని ఈ షోకు హాజరైన ఆర్మీ అధికారులను కోరారు. ఆర్మీలో చేరడం కోసం పేపర్ వర్క్ కూడా పూర్తి చేశానని, నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని తెలిపారు.

ఇండియన్ ఆర్మీకి థాంక్స్
‘నా ఇండియన్స్ అందరికీ నమస్కారం. నా పేరు అల్లు అర్జున్.. నా ఇల్లు ఇండియా. ఈ సినిమా విషయంలో మాకు సపోర్ట్ చేసిన ఇండియన్ ఆర్మీకి ముందుగా థాంక్స్ చెబుతున్నాను. రియల్ ఆర్మీ ఆఫీసర్స్, రియల్ ఆర్మీ లొకేషన్స్‌లో షూట్ చేయాలనే మా తపనను అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ మొత్తానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారి సపోర్ట్ లేకుంటే సినిమాలో మీరు చూసిన అద్భుతమైన విజువల్స్ సాధ్యం అయ్యేవి కావు.... అని అల్లు అర్జున్ అన్నారు.

ఈ సినిమాతో చాలా రెస్పెక్ట్ వచ్చింది
ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశాను. సినిమా సక్సెస్ అయితే చాలా పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. అన్నింటికి మించి ఈ సినిమా ద్వారా మాకు మంచి రెస్పెక్ట్ వచ్చింది. ఇలాంటి మూవీ చేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను.... అని అల్లు అర్జున్ అన్నారు.

ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటన
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించారు. ‘ఇండియన్ ఆర్మీ క్వార్టర్స్‌లో షూటింగ్ జరిగినపుడు అక్కడి వాతావరణం, సైనికుల లైఫ్ చూసి నేనూ వారిలో ఒకడిని కావాలనుకున్నాను. పేపర్స్ మీ చేతుల్లో ఉన్నాయి సార్(షోకు హాజరైన అధికారులను ఉద్దేశించి).... నాకు ఆర్మీలో అవకాశం దొరికితే ఎంతో గౌరవంగా భావిస్తాను అని అల్లు అర్జున్ అన్నారు.

నాకు గొప్ప సినిమా ఇచ్చారు
దర్శకుడు వక్కంతం వంశీ, లగడపాటి శ్రీధర్ గారు నా కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని ఒక గొప్ప సినిమాను అందించారు. ఇలాంటి సినిమాను నన్ను నమ్మి చేసినందుకు చాలా చాలా థాంక్స్ అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











