అల్లు అర్జున్, వక్కంతం వంశీ మధ్యలో ఎన్టీఆర్ ఏంటి.. అసలు నిజం ఇదే అంటున్న డైరెక్టర్!

Recommended Video

Naa Peru Surya Movie Lead Into A Controversy

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. అల్లు అర్జున్ ఆర్మీ అధికారి పాత్రలో నటించిన చిత్రం ఇది. బన్నీ యాంగ్రీ సోల్జర్ గా అదరగొట్టాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. నా పేరు సూర్య చిత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. బన్నీ నటించిన ఈ చిత్రం పూర్తి స్థాయి దేశ భక్తి కథాంశంగా తెరకెక్కింది. రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇదే. కాగా వంశి గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలకు అదిరిపోయే కథలు అందించారు. నా పేరు సూర్య చిత్ర కథ గురించి కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వక్కంతం వంశీ క్లారిటీ ఇచ్చారు.

యాంగ్రీ సోల్జర్‌గా

యాంగ్రీ సోల్జర్‌గా

అల్లు అర్జున్ ఈ చిత్రంలో యాంగ్రీ సోల్జర్ గా అదరగొట్టాడు. ఈ చిత్రంలో బన్నీ గెటప్ చిత్ర విడుదలకు ముందే అభిమానులని బాగా ఆకట్టుకుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అభిమానుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటోంది.

 బన్నీ రాజ ముద్ర

బన్నీ రాజ ముద్ర

దర్శకుడిగా మారడం ఎన్నో ఏళ్ల కల అని, ఆ కలని అల్లు అర్జున్ నెరవేర్చడాని వక్కంతం వంశీ పలు సందర్భాల్లో అన్నారు. కథ ఎంత మందికి నచ్చినా హీరో రాజముద్ర వేయకపోతే సినిమా ముందుకు సాగదని వంశి ప్రీరిలీజ్ ఈవెంట్ లో తెలిపిన సంగతి తెలిసిందే. కానీ తన కథకు అల్లు అర్జున్ రాజ ముద్ర వేశారని అందువలనే దర్శకుడు కావాలనే తన కల సాకారం అయిందని వంశి తెలిపాడు.

కథ ఎవరి కోసం

కథ ఎవరి కోసం

నా పేరు సూర్య చిత్ర కథ మొదట ఎన్టీఆర్ కోసం వంశి రాసుకునట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వలనో, ఇతర చిత్రాలతో బిజీగా ఉండకపోవడం వలనో వంశికి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కలేదు. దీనితో ఈ కథని అల్లు అర్జున్ దగ్గరకు తీసుకుని వెళ్లారనే ప్రచారం జరిగింది.

వివరణ ఇచ్చిన వంశి

వివరణ ఇచ్చిన వంశి

వక్కంతం వంశి దీనిపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నా పేరు సూర్య కథ అల్లు అర్జున్ కోసమే రాసినది అంది వంశి తెలిపాడు. ఎన్టీఆర్ కోసం మరో కథ తయారు చేశానని, దానిని పూర్తి స్థాయిలో రూపుదిద్దాల్సి ఉందని తెలిపాడు. నా పేరు సూర్య చిత్రం మంచి విజయం సాధిస్తే వక్కంతం వంశి ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందని భావించవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X