బన్నీ పడ్డ కష్టానికి రికార్డులన్నీ బద్దలు: ‘నా పేరు సూర్య’ సంచలనం

By Bojja Kumar

Recommended Video

‘నా పేరు సూర్య’ సంచలనం.. రికార్డులన్నీ బద్దలు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఇపుడు ఇంటర్నెట్లో సంచలనం అయింది. విడుదలైన 29 గంటల్లోనే 10 మిలియన్(కోటి) డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుని ఫాస్టెస్ట్ 10 మిలియన్ మార్కు అందుకున్న టీజర్‌గా టాలీవుడ్లోని రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది.

నెం.1 స్థానంలో ‘నా పేరు సూర్య’ టీజర్

నెం.1 స్థానంలో ‘నా పేరు సూర్య’ టీజర్

తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమా టీజర్‌గానీ, ట్రైలర్ గానీ ఇంత తక్కువ సమయంలో 10 మిలియన్ మార్కు అందుకోలేదు. ఈ విషయంలో ‘నా పేరు సూర్య' అన్ని సినిమాలను వెనక్కి నెట్టేసి నెం.1 స్థానంలో నిలిచింది.

బన్నీ హార్డ్ వర్క్ టీజర్లో కనిపించింది

బన్నీ హార్డ్ వర్క్ టీజర్లో కనిపించింది

‘నా పేరు సూర్య' సినిమా కోసం బన్నీ ఎంత హార్డ్ వర్క్ చేశాడో టీజర్లో కనిపిస్తోందని,...... తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్ కూడా ఇంత ఇంపాక్ట్ చూపించలేదని అభిమానులు అంటున్నారు.

భారీగా పెరిగిన ఎక్స్‌పెక్టేషన్స్

భారీగా పెరిగిన ఎక్స్‌పెక్టేషన్స్

టీజర్ విడుదల ముందు వరకు ‘నా పేరు సూర్య' చిత్రంపై అంచనాలు పెద్దగా లేవు. వక్కతం వంశీకి దర్శకత్వం కొత్తకావడమే అందుకు కారణం. అయితే టీజర్ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలాగా అతడు సినిమాను తెరకెక్కించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది.

అల్లు అర్జున్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అదుర్స్

అల్లు అర్జున్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అదుర్స్

‘నా పేరు సూర్య' టీజర్లో బన్నీ పెర్పార్మెన్స్ చూసిన వారంతా భిన్నమైపోతున్నారు. బన్నీలో ఇంత పవర్ ఎప్పుడూ చూడలేదని, సైనికుడి పాత్రలో బన్నీ ఇంత బాగా చేస్తాడని అస్సలు ఊహించలేదని, అతడి పెర్ఫార్మెన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కింగ్ ఆఫ్ సోషల్ మీడియా

కింగ్ ఆఫ్ సోషల్ మీడియా

అల్లు అర్జున్‌ను అభిమానులు కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుస్తుంటారు. అతడి సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో, కర్నాటకలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే ఇందుకు కారణం. తాజాగా ‘నా పేరు సూర్య' విషయంలో కూడా ఇదే జరిగింది.

100 మిలియన్లు దాటిన సరైనోడు మూవీ

100 మిలియన్లు దాటిన సరైనోడు మూవీ

అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు' మూవీ హిందీ డబ్బింగ్ యూట్యూబులో 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. దీన్ని బట్టి బన్నీ చిత్రాలకు ఉత్తరాదిన కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అతడి సినిమాలకు ఇంటర్నెట్ ఫ్లాట్ ఫాంలో ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో ఫాస్టెస్టుగా 80 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న మూవీ కూడా ఇదే.

తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి మూవీ రాలేదు

తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి మూవీ రాలేదు

తెలుగులో ఇప్పటి వరకు ఆర్మీ ట్రైనింగ్ బ్యాక్ డ్రాపులో సినిమాలు రాలేదు. అందులోనూ ఇంత పవర్‌ఫుల్ యాక్టింగుతో ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో ‘నా పేరు సూర్య' చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కోపిష్టి సోల్జర్‌గా

కోపిష్టి సోల్జర్‌గా

ఇటీవల విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్లో..... ‘నీకు సూర్య అంటే సోల్జర్... కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్.' అనే డైలాగ్ ఉంది. దీన్ని బట్టి బన్నీ ఈ చిత్రంలో కోపిష్టి సోల్జర్‌గా కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.

ఆ డైలాగ్ అదుర్స్

ఆ డైలాగ్ అదుర్స్

‘చచ్చిపోతాను గాడ్ ఫాదర్... కానీ ఇక్కడ కాదు. బార్డర్‌కు వెళ్లి చచ్చిపోతాను' అంటూ బన్నీ చెప్పి డైలాగ్ టీజర్ కే హైలెట్ అయింది. దీన్ని సూర్య పాత్రలో దేశ భక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ హైలెట్ హైలెట్ అయ్యేలా చేశాయి.

నా పేరు సూర్య

నా పేరు సూర్య

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X