Naa Saami Ranga Twitter Review నా సామిరంగ.. సంక్రాంతి విజేతగా నిలుస్తుందా? నాగ్ హిట్ కొడతాడా?
మలయాళం సినిమా రంగంలో ఘన విజయం సాధించిన పొరింజు మరియం జోష్ మూవీ ఆధారంగా రూపొందిన చిత్రం నా సామిరంగ. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస నిర్మాతగా, పవన్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జున అక్కినేని, కన్నడ భామ ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, మిర్నా మీనన్, రాజ్ తరుణ్, రుక్సర్ థిల్లాన్ నాజర్, రావు రమేష్ తదితరులు నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి పండుగకు సరిపడే వినోదంతో వస్తున్న నా సామిరంగ చిత్రం ఫెస్లివల్ వైబ్‌ను తీసుకొస్తున్నది. ఈ సినిమాను మీరందరూ బ్లాక్‌బస్టర్ సినిమాగా చేస్తారని ఆశిస్తున్నాను అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

నా సామిరంగ మూవీ ఫస్టాఫ్ ఇప్పడే ఫినిష్ అయింది. ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది. లవ్ స్టోరి సీన్లు ఆకట్టుకొన్నాయి. రాజ్ తరుణ్, అల్లరి నరేష్ సీన్లు కూడా చూడటానికి నైస్. ఇంటర్వెల్ సీన్‌కు ర్యాంప్ చేయడానికి ఎక్కువ కాగితాలు పెట్టుకోండమ్మా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నా సామిరంగ సినిమాలో హైలెట్స్ ఇవే.. నాగ్ ఎంట్రీ సీన్. అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్. నాగ్, ఆషికా మధ్య లవ్ ట్రాక్. ఇంటర్వెల్ బ్లాక్. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ హై ఎమోషనల్. సాంగ్స్ కలిపి సినిమాకు అన్నీ బాగా సెట్ అయింది. ఇక ఆడియెన్స్ చేతిలో ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
నా సామిరంగ సినిమా ఫస్టాఫ్ బాగుంది. నాగార్జున కనిపించే సీన్లు చాలా బాగున్నాయి అంటూ సినిమాలోని యాక్షన్ వీడియోను నెటిజన్ పోస్టు చేశారు.
కింగ్ నాగార్జున అంటూ కొత్తగా డిజైన్ చేసిన టైటిల్ కార్డుపై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి టైటిల్ కార్డుతో నాగ్ ర్యాంప్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి టైటిల్ కార్డును ఏ హీరోకు చూడలేదు అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
నా సామిరంగ మెంటల్ మాస్. ఇంటర్వెల్ యాక్షన్ సీన్లు అదరిపోయాయి. సైకిల్ చైన్ రెఫరెన్స్ బాగుంది. కింగ్ నాగార్జున ర్యాంప్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
సంక్రాంతికి నా సామిరంగ సినిమా మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. కింగ్ నాగార్జున కమ్ బ్యాక్ మూవీ. మీరెవరూ కూడా ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
నా సామిరంగ సినిమాలో కింగ్ నాగార్జున బీడీ ముట్టించుకోవడమే కాదు.. ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లను అభిమానులకు, ఫ్యాన్స్‌కు ఇవ్వబోతున్నాం అని హీరో రాజ్ తరుణ్ అన్నారు.
నా సామిరంగ సినిమా గురించి దర్శకుడు విజయ్ బిన్ని ఎమోషనల్ అయ్యారు. ఎన్నాళ్లో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. నా కల రేపు నెరవేరబోతున్నది. ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. మీ దగ్గర ఉన్న థియేటర్‌లోనే ఈ సినిమాను చూడండి అంటూ విజయ్ బిన్ని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











