twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం... ప్రముఖ టెలివిజన్ నటుడు అరెస్ట్

    |

    ప్రముఖ టీవీ నటుడు, నాగిన్ 3 ఫేమ్ పర్ల్ వీ పూరిపై రేప్ కేసు నమోదైందనే వార్త టెలివిజన్ రంగాన్ని ఓ కుదుపు కుదిపేసింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగం షాక్ గురైంది. ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..

    పర్ల్ వీ పూరీ అరెస్ట్ వార్తతో

    పర్ల్ వీ పూరీ అరెస్ట్ వార్తతో

    హిందీ టెలివిజన్ రంగాన్ని పలు వివాదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నదాయి. ఇప్పటికే కరన్ మెహ్ర, నిషా రావల్ వివాదం కొనసాగుతుండగానే పర్ల్ వీ పూరీ వ్యవహారం తెరపైకి వచ్చింది. పూరీ అరెస్ట్ వార్తను టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటకు రాకపోవడం మరింత ఉత్కంఠను రేపుతున్నది.

     మైనర్ బాలికపై సామూహిక మానభంగం

    మైనర్ బాలికపై సామూహిక మానభంగం

    బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. మైనర్ బాలికపై పర్ల్ వీ పూరి మానభంగం చేశారు. తనను కారులో తీసుకొని వెళ్లిన కొందరు పదే పదే తనపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ గ్రూపులో పర్ల్ వీ పూరి కూడా ఉన్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది. పోలీస్ కస్టడీలో ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు అని పేర్కొన్నారు.

    పోలీస్ కస్టడీలో పర్ల్ వీ పూరి

    పోలీస్ కస్టడీలో పర్ల్ వీ పూరి

    నటుడు పర్ల్ వీ పూరిపై బాధితురాలు జూన్ 4వ తేదీ రాత్రి ముంబైలోని వాలివ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అతడిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోని అతడిని విచారిస్తున్నారు. అతడిపై చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోస్కో) యాక్ట్ కింద కేసు నమోదు అయింది అని పోలీసుల వర్గాలు వెల్లడించారు.

    Recommended Video

    Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
    పర్ల్ వీ పూరీ కెరీర్ ఇలా...

    పర్ల్ వీ పూరీ కెరీర్ ఇలా...

    పర్ల్ వీ పూరి కెరీర్ విషయానికి వస్తే ఆయన 2019లో దిల్ కీ నజర్ సే ఖూబ్ సూరత్ అనే సీరియల్‌తో హిందీ వినోదరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఫిర్ బీ నా మానే, బత్తమీజ్ దిల్ సీరియల్‌తో పాపులారిటీని సంపాదించారు. నాగిన్ 3, నాగార్జున ఏక్ యోధ, బేపనా ప్యార్ సీరియల్స్‌తో మరింత పాపులారిటీని సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం బ్రహ్మరాక్షస్ 2 టీవీ సీరియల్‌లో నటిస్తున్నారు.

    English summary
    Popuar Television actor, Naagin 2 fame Pearl V Puri arrested in rape and molestation case under Children from Sexual Offences (POSCO) Act by the Waliv police. Along with Pearl V Puri, six members were involved in this case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X