దర్శకుల కోసం నాంది డైరెక్టర్ చేయూత.. మీకు తోచినంత సహాయం చేయండి అంటూ..
ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఎన్నో కుటుంబాలు మళ్ళీ ఆకలి చావులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇక సినిమా ఇండస్ట్రీలో పనులు లేక ఎప్పటిలానే సహాయం కోసం వేల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. దానికితోడు కొంతమంది టెక్నీషియన్స్ కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న దర్శకుల కుటుంబాలకు సహాయం చేసేందుకు నాంది దర్శకుడు విజయ్ కనకమేడల ఒక మంచి పనికి నాంది పలికాడు.
సోషల్ మీడియాలో ఈ విదంగా పేర్కొన్నాడు. దర్శకుల సంఘం సభ్యులు కూనంశెట్టి వెంకటేశ్వరరావు గారు, శ్రావణ్ గారు, శ్రీకారం సినిమా కోడైరెక్టర్ రాజా గారు, మా అబ్బాయి సినిమా డైరెక్టర్ కుమార్ గారు కరోనా వల్ల రీసెంట్ గా మరణించిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబాలకు సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి 25,000 /చొప్పున లక్ష రూపాయలు వారం క్రితమే బ్యాంక్ ఎకౌంట్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయించినట్లు.. చెప్పాడు.

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న డైరెక్టర్స్ కుటుంబాలకు వీలైనంత వరకు రోజువారీ నిత్యావసరలకు గాను అలాగే మినిమమ్ గ్రో సరీస్ కు ఎంతో కొంత సహాయం చేయాలని అనుకుంటున్నాము. మనకు చేతనైన సహాయం చేసి ఒక మంచి పనికి "నాంది" పలుకుదాం. మీ అందరిని కోరేది ఒక్కటే. నా తరపున మీ తరఫున మన అందరి తరపున అత్యవసరమైన వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రండి. సహాయం చేయండి.. అంటూ దర్శకుడు విజయ్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











