వాళ్ల తప్పు వల్లే ఎన్టీఆర్‌కు పరాభవం.. చెప్పాల్సింది చాలా ఉంది: నాంది డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
హిట్లతో దూసుకుపోతోన్న స్టార్‌తో కాకుండా.. దాదాపు ఎనిమిదేళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతోన్న హీరోతో తన మొదటి సినిమా చేసి.. భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల. ఈ ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో 'నాంది' ఒకటి. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ మూవీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో దర్శకుడు విజయ్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. ఈ నేపథ్యంలో అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

విజయ్ కనకమేడల కెరీర్ ఇలా.. బడా స్టార్లతోనే
విజయ్ కనకమేడల కెరీర్ ఆరంభంలోనే పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఈ క్రమంలోనే దాదాపు పదిహేనేళ్లుగా స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దగ్గర సహాయకుడిగా చేశాడు. ఈ క్రమంలోనే 'మిరపకాయ్', 'రామయ్యా వస్తావయ్యా', 'గబ్బర్ సింగ్' సహా ఆయన తెరకెక్కించిన చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ఈ క్రమంలోనే 'నాంది'తో మెగా ఫోన్ పట్టాడు.

సెక్షన్‌తో నరేష్‌ను హిట్ ట్రాక్ ఎక్కించిన విజయ్
సెక్షన్ 211 ఆధారంగా రూపొందిన చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సతీష్ వేగేష్న నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలతో పాటు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఫలితంగా ఇప్పటి వరకు ఈ సినిమాకు రూ. 2 కోట్లకు పైగానే లాభాలు కూడా వచ్చాయి.

దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు.. వరుస ఆఫర్లతో
'నాంది' సక్సెస్ అవడంలో విజయ్ కనకమేడల పాత్ర ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మొదటి సినిమాలోనే ఎవరికీ తెలియని కొత్త పాయింట్‌ను ఎంచుకుని సక్సెస్ అయిన అతడు.. టేకింగ్ విషయంలోనూ మంచి పేరును అందుకున్నాడు. దీంతో అతడి దర్శకత్వ ప్రతిభపై ప్రశంసల వర్షం కురిస్తోంది. దీంతో విజయ్‌కు ఆఫర్లు కూడా వస్తున్నాయి.

తర్వాతి సినిమా స్టార్‌తోనే చేసేందుకు సన్నాహం
మొదటి సినిమాను ఫ్లాపులతో సతమతం అవుతోన్న అల్లరి నరేష్‌తో చేసి.. అతడిని హిట్ ట్రాక్ ఎక్కించాడు విజయ్ కనకమేడల. అయితే, తన రెండో సినిమాను మాత్రం స్టార్ హీరోతోనే చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఓ బడా నిర్మాణ సంస్థలో అతడి తదుపరి ప్రాజెక్టు ఉంటుందని కూడా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

వాళ్ల తప్పు వల్లే ఎన్టీఆర్ సినిమాకు పరాభవం
'నాంది' హిట్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు విజయ్ కనకమేడల. దీంతో తన తర్వాతి సినిమాపై బాగా ఫోకస్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలను వెల్లడించాడు. ఈ ఫలితం వెనుక అందరి పాత్ర ఉందని చెప్పుకొచ్చాడు.

ఒకటి అనుకుని.. ఇంకోటి చేయడం వల్లే ఇలా
'రామయ్యా వస్తావయ్యా' అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన విజయ్ కనకమేడల.. దాని గురించి మాట్లాడుతూ.. 'నిజానికి ఈ సినిమాకు వేరే కథ అనుకున్నాం. కానీ, సెట్స్ మీదకు వచ్చే సరికి చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో గతంలో చూసిన సీన్లులా అనిపించి సినిమా ఫ్లాప్ అయింది. మొత్తానికి అంతా కలిసే తారక్ అన్నకు ఫ్లాప్ ఇచ్చినట్లైంది' అంటూ వివరించాడాయన.

చెప్పాల్సింది చాలా ఉంది.. భారీ సినిమా తీస్తా
తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. 'నేను జూనియర్ ఎన్టీఆర్‌తో గ్రేట్ మూవీ చేస్తా. ఇప్పటి వరకూ ఆయనను చూపించని విధంగా ఉంటుంది. ఆయనలోని టాలెంట్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. అదంతా ఒకే ఒక్క సినిమాలో చూపిస్తా. ఆయనతో సినిమా నా కల. అది ఎప్పటికైనా నెరవేరుతుంది. తారక్ అన్న అనేలా మా మధ్య బంధం ఉంది' అంటూ చెప్పాడు విజయ్.


Click it and Unblock the Notifications











