రాజమౌళి ఈగ లో ఆ హీరో, హీరోయిన్స్ కన్ఫర్మ్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్వరలో ప్రారంభించబోతున్న ఈగ చిత్రంలో నాని , సమంత హీరో,హీరోయిన్స్ గా సెలెక్టు అయ్యారు. అలాగే విలన్ గా కన్నడ నటుడు సుదీప్ ని తీసుకున్నారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ ఏడవ తేదిన రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభం కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఈగ ప్రధానపాత్రలో కథ నడుస్తుంది. గత కొంతకాలంగా ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ నడుస్తోంది. పూర్తి స్ధాయి గ్రాఫిక్స్ తో కూడిన ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఈ 'ఈగ' ని తీర్చిదిద్దాలని రాజమౌళి భావిస్తున్నారు. అలాగే 'ఈగ' మాత్రమే గ్రాఫిక్స్ అనీ మిగతా పాత్రల్లో మనుష్యులు ఉండనున్నారని చెప్తున్నారు. ఇక కథ మొత్తం 'ఈగ' పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది.ఈ చిత్రంతో పాటు రాజమౌళి తన తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందే రాజన్న చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు.


Click it and Unblock the Notifications











