వెంకటేష్ ‘రా’ను పాలో అవుతున్న నాగ్
'జోష్" చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ బాబు సోదరి మంజుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తమిళంలో 'విన్నైతాండి వరువాయ' పేరుతో శింబు, త్రిష జంటగా ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. తమిళ టైటిల్ కు దగ్గరగా ఉండేలా 'నాతో రా' అనే టైటిల్ ను ఆయన అనుకుంటున్నారు.
అలా అయితే మేనమామ వెంకటేష్ దారిలో మేనల్లుడు నాగ చైతన్య నడుస్తున్నాడు. ఏ విషయంలో అనుకుంటున్నారా? 'జోష్" తర్వాత నాగ చైతన్య నటిస్తున్న చిత్రానికి 'నాతో రా" అన్న టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కు సూపర్ హిట్స్ అందించిన 'ప్రేమంటే ఇదే 'రా", 'ప్రేమించుకుందాం 'రా", జయం మనదే'రా", చిత్రాలు 'రా" తో ఎండ్ అవుతాయి. నాగచైతన్య తాజా చిత్రం టైటిల్ కూడా 'రా"తో ముగుస్తుంది. వెంకటేష్ కు కలిసొచ్చిన 'రా" సెంటిమెంట్ ను ఫాలో అవుతనున్నాడన్నమాట! సెంటిమెంట్ వర్కవుట్ అయి హిట్ కొట్టి మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటాడేమో మరి!


Click it and Unblock the Notifications











