RRR for Oscars 2023: రాజమౌళి అద్బుతం.. ప్రభాస్, బాలయ్య, రవితేజ ఏమన్నారంటే?

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల రికార్డులు, సినీ దిగ్జజాల ప్రశంసలు అందుకొంటున్న RRR చిత్రం మరో అరుదైన ఘనతను సాధించింది. అందరూ ఊహించినట్టుగానే ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. మంగళవారం రాత్రి జరిగిన ఆస్కార్ అవార్డుల నామినేషన్ కార్యక్రమంలో RRR సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిందని ప్రకటించారు. ఈ వార్త బయటకు రాగానే.. తెలుగు సినిమా ప్రముఖులంతా RRR యూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్‌తోపాటు ఎవరెవరూ స్పందించారనే వివరాల్లోకి వెళితే..

భారతీయ సినీ జగత్తులో మరో మైలురాయి


RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యిందనే వార్త బయటకు రాగానే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్ గారికి కంగ్రాట్స్. ఈ సినిమా మరో మైలురాయిని దాటి, చరిత్రను సృష్టించినందుకు అభినందనలు. ఈ పాటకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

గర్వంగా ఫీలయ్య గొప్ప అనుభూతి


RRR లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిందనే విషయం బ్రిల్లియెంట్ న్యూస్. నాటు నాటు ఆస్కార్ నామినేట్ కావడం గొప్ప గౌరవం. భారత సినీ పరిశ్రమ గర్వంగా ఫీలయ్యే గొప్ప ఫీలింగ్. తారక్, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి ఈ ఘనతకు నిజంగా అర్హులు. RRR సినిమా యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు అని రాంచరణ్ ట్వీట్ చేశాడు.

బిగ్ హగ్ మీకు అంటూ


నాటు నాటు పాట ఆస్కార్ నామినేట్ కావడంపై సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. RRR యూనిట్‌కు కంగ్రాట్యులేషన్. మీ అందరికి బిగ్ హగ్ అంటూ కీరవాణి ట్వీట్ చేశారు.

బాలకృష్ణ అభినందన

బాలకృష్ణ అభినందన

RRR చిత్రంలో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌కు నామినేట్కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. RRR చిత్ర బృందానికి నా అభినందనలు. అలాగే డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో నామినేట్ అయిన ఆల్ దిట్ బ్రెత్స్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్ విభాగంలో నామినేట్ అయిన ది ఎలిఫెంట్ విష్కర్స్ చిత్ర బృందాలకునా అభినందనలు అని నందమూరి బాలకృష్ణ ఓ ప్రత్యేక ప్రకటనలో అభినందించారు.

రాజమౌళి ది గ్రేటెస్ట్


ఆస్కార్‌కు నాటు నాటు పాట నామినేట్ కావడంపై ప్రభాస్ స్పందించారు. ది గ్రేటెస్ట్ రాజమౌళి మరో అద్బుతం సృష్టించాడు. కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌కు కంగ్రాట్యులేషన్ అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రభాస్ పోస్టు పెట్టారు.

భారతీయ సినీ చరిత్రలో కలికితురాయి


భారతీయ సినిమా కిరిటంలో మరో కలికితురాయి. ఆస్కార్ అవార్డు కోసం నాటునాటు నామినేట్ అయింది. ఇది ఒక అద్భుతం. చిత్ర యూనిట్‌కు కంగ్రాట్యులేషన్ అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు.

రవితేజ ట్వీట్‌లో


ఇక నాటు దెబ్బ డైరెక్ట్‌గా ఆస్కార్ కే అంటూ రవితేజ ట్వీట్ చేశారు. రాంచరణ్, ఎన్టీఆర్‌తోపాటు ప్రపంచం మొత్తంతో నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించిన ఎంఎం కీరవాణికి అభినందనలు. రాజమౌళి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, ఈ సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరికి బిగ్ కంగ్రాట్స్ అని రవితేజ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X