‘నాయక్’ సెన్సార్ రిపోర్ట్ డిటేల్స్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'నాయక్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను ఈ రోజు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడానికి దర్శక నిర్మాతలు ఒప్పుకోక పోవడంతో 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ విషయాన్ని దర్శకుడు వివి వినాయక్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా వెల్లడించారు.
సాధారణంగా హద్దు మీరిన హింస, ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులు లాంటివి ఉన్నప్పుడు... పిల్లలు చూడకూడని సినిమా అని ఈ విధమైన సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తుండగా....ఆ రెండు పాత్రల సరసన కాజల్, అమలపాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మెగా అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ తో దర్శకుడు వినాయక్ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందించారు. ఈ నెల 9న 'నాయక్' చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











