తప్పు దిద్దుకున్న రామ్ చరణ్ ‘నాయక్’
హైదరాబాద్ : రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నాయక్'. ఈచిత్రం ఫస్ట్ ట్రైలర్ రీసెంట్ గానే విడుదలైంది. ఈ ట్రైలర్ లో ఓ చిన్న తప్పు దొర్లింది. ఈ ట్రైలర్ లో మెన్షన్ చేసిన స్టేట్ మెంట్ 'History Creates Leaders But A Real History Will Rewrite History.' లో హిస్టరీ అనే పదం రెండు సార్లు వచ్చింది. లీడర్ అని రావాలి. అయితే వెంటనే మేకర్స్ ఈ విషయం గమనించి...రెక్టిఫై చేసి 'History Creates Leaders But A Real Leader Will Rewrite History.' తో కొత్త వెర్షన్ విడుదల చేసారు. ట్రైలర్ చూసిన వారు తప్పకుండా హిస్టరీ క్రియేట్ చేస్తుందని నమ్మకంగా అంటున్నారు.
ఇక ఈ నెల 17న జరుగనున్న 'నాయక్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు మెగా ఫ్యామిలీలో హీరోలంతా హాజరవుతున్నారని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు వస్తున్నారని ప్రచారం జరిగింది. తాజాగా అందని సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ ఆడియో వేడుకకు రావడం లేదని స్పష్టం అయింది. ప్రస్తుతం ఆయన తన సినిమాకు సంబంధించిన పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి స్పెయిన్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ పలు లొకేషన్లు సెలక్ట్ చేయడంతో పాటు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు రావడం లేదనే విషయాన్ని సోషల్ నెట్వర్కింగ్‌లో ఉన్న పలు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పేజీల్లో కూడా స్పష్టం చేసారు.
రామ్ చరణ్ ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లతో యమరంజుగా రొమాన్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నాడు. చరణ్ కి జోడీగా హీరోయిన్ కాజల్, అమలపాల్‌లపై చిరంజీవి సూపర్ హిట్ సాంగులను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు...'నాయక్' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అదరిపోతోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం గుంటూరు మినహా అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి రికార్డు స్థాయి రేటు పలికిందని తెలుస్తోంది.
యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











