‘నాయక్’ తమిళ,మళయాళ వెర్షన్ రిలీజ్ డిటేల్స్
హైదరాబాద్: సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ చరణ్ 'నాయక్' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం తమిళ,మళయాళ ప్రేక్షకులని సైతం అలరించనుంది. కేరళలో ఈ చిత్రం మార్చి 15న విడుదల చేస్తున్నారు. అక్కడ దాదాపు 70 సెంటర్లలలో విడుదల అవుతోంది. అలాగే తమిల వెర్షన్ .. ఈ నెల 22 న విడుదల చేస్తున్నారు. తమిళ్ లో సైతం భారీగానే విడుదల చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. ఈ రెండు చోట్ల బిజినెస్ బాగా జరిగినట్లు వినికిడి.
ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసారు. వినాయక్ తరచూ తీసే రొటీన్ సినిమాలా ఉందనే విమర్శలు వచ్చినప్పటికీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, జిలేబీ పాత్రలో బ్రహ్మీ కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు కాజల్, అమలా పాల్ గ్లామర్ సొగసులతో పాటు, తమన్ సంగీతం, చోటా కె నాయుడు కెమెరా పనితనం బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఐస్ లాండ్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్లలో 'శుభలేఖ రాసుకున్న' సాంగు చిత్రీకరణ అందరినీ ఆకట్టుకుంది.
వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మించింది. డి.వి.వి.దానయ్య నిర్మాత. సంక్రాంతిని పురస్కరించుకని జనవరి 9న ఈచిత్రం విడుదలైంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ హీరోయిన్స్ గా చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటించారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











