అందరూ నన్నే రూంకి పిలిచేవారు.. నభా నటేష్ కామెంట్స్ వైరల్
నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో మంచి పేరును సంపాదించుకుంది. నభా నటించిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఆమెకు మాత్రం మంచి పేరు వస్తుంటుంది. అలా నభా నటేష్ తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ నభా నటేష్ తనదైన ముద్ర వేసుకుంటూ ఉంటుంది. తెరపై ఎంత సరదాగా ఉంటుందో సోషల్ మీడియాలోనూ అంతే సరదాగా ఉంటుంది.

తెరపై రచ్చ..
మొదటి నుంచి కూడా నభాకు హైపర్ యాక్టివ్‌గా ఉండేపాత్రలే వచ్చాయి. నన్ను దోచుకుందవటే, ఇస్మార్ట్ శంకర్ ఇలా రెండు సినిమాల్లోనూ తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పైగా నటించేందుకు ఎంతో స్కోప్ ఉండే క్యారెక్టర్స్ రావడంతో రెచ్చిపోయింది.

ఒకటి అలా ఇంకోటి ఇలా..
రీసెంట్‌గా నభా నటేష్ సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాలతో పలకరించింది. 2020 ఎండింగ్‌లో సోలో బ్రతుకే సో బెటర్‌తో హిట్ కొట్టిన నభా.. 2021 సంక్రాంతి బరిలోకి అల్లుడు అదుర్స్ సినిమాతో నిరాశ కలిగించింది. అయితే నభా పాత్రకు నటనకు మంచి ప్రశంసలే లభించాయి.

సోషల్ మీడియాలో అలా..
నభా నటేష్ సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. చీర కట్టులో అందరినీ కట్టిపడేస్తూనే.. మరో వైపు మోడ్రన్ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇలా హాట్ హాట్ ఫోటోలతో అలరించడమే కాకుండా.. నిత్యం తన అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

వెరైటీ ఆట..
తాజాగా నభా నటేష్ తన ఫాలోవర్లతో ఓ ఆట ఆడింది. మీరు ఏదైనా అడగండి.. అది నిజమా? కాదా? అని చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ట్రూ ఆర్ ఫాల్స్ ఆటలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు అడిగారు. మీకు దెయ్యాలంటే భయమా? కాఫీ అంటే ఇష్టమా?.. లవ్‌లొ ఉన్నారా? అంటూ వెరైటీ ప్రశ్నలు అడిగారు.

అందరూ నన్నే..
ఓ నెటిజన్ బల్లులు అంటే భయమా? అని అడిగితే వింత సమాధానం చెప్పింది నభా. తనకు అవంటే అసలు భయం లేదని, పైగా హాస్టల్స్‌లో ఉన్న సమయంలో ఎవరి రూంలోనైనా ఉంటే తీసేయడానికి అందరూ నన్నే పిలిచే వారంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











