ఇంత తక్కువ బడ్జెట్ తో అంత పెద్ద హిట్టా అంతా నచ్చావులే బడ్జెట్ విని షాక్ అవుతున్నారు. ఉషాకిరణ్ బ్యానర్ పై అల్లరి రవిబాబు అంతా కొత్త ఆర్టిస్టులతో నిర్మిచిన ఈ చిత్రం ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి కోటి ఎనభై లక్షలు మాత్రమే ఖర్చయ్యాయని, ఈ బడ్జెట్ లో ఎనభై ఐదు లక్షలు సెట్ వర్క్ కి ఖర్చు చేసారని మిగతావి ప్రొడక్షన్ ఖర్చులు అని సమాచారం. అయితే ఇంత తక్కువ బడ్జెట్ లోనూ ఎక్కడా క్వాలిటీ దెబ్బతినకుండా తీసారు. గతంలో చిన్న బడ్జెట్ తో పెద్ద విజయాలు సాధించిన ఘనత రామోజిరావుది. మళ్ళీ ఆ ఫీట్ రిపీట్ అయినందుకు ఆయన ఆనందంగా ఉన్నారని తెలుస్తోంది. అలాగే ఇది చిన్న నిర్మాతలకు ఊపునిచ్చే చిత్రంగానే కాక ఎలా తీయాలనేది చెప్పే చిత్రం గా ఉంటుందని అంటున్నారు. ఏదైమైన పబ్లిసిటీ నుంచి అంతా విచిత్రంగా చేసి హిట్ కొట్టిన రవిబాబుదే ఈ క్రెడిట్ అనేది మాత్రం నిజం. కంగ్రాట్స్ రవిబాబు.