చిక్కుల్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’... బాలకృష్ణ, క్రిష్‌కు నోటీసులు

By Bojja Kumar

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై అభ్యంతం వ్యక్తం చేస్తూ నాదేండ్ల భాస్కర్ రావు కుటుంబం చిత్ర దర్శక నిర్మాతలకు, బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఈ సినిమాలో తన తండ్రి నాదేండ్ల భాస్కర్ రావు పాత్రను నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పెద్దకొడుకు ఈ నోటీసులు జారీ చేశారు.

ఇక బాలయ్యకు రెండు నోటీసులు అందాయి. సినీ నటుడు హోదాలో ఆయన ఇంటికి, ఎమ్మెల్యే హోదాలో ఆయన కార్యాలయానికి ఈ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ సినిమా విషయంలో తమ కుటుంబంలోని వారి పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని నాదేండ్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Nadendla Bhaskar Rao Family Sends Notice To Balakrishna

మరి ఈ నోటీసుకు బాలకృష్ణ, క్రిష్ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అనేది చర్చనీయాంశం అయింది. కాగా.... కాంగ్రెస్ నేత నాదేండ్ల భాస్కరరావు పాత్రను ప్రముఖ నటుడు పరేశ్ రావెల్ పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణతోపాటు విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సహానిర్మాతగా వ్యవహరించనున్నారు. కీరవాణి సంగీతాన్ని అందించనున్నారు. సంతోష్ తుండియిల్ కెమెరామెన్‌గా, కొటగిరి వెంకటేశ్వరరావ ఎడిటిర్ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. జనవరి 9నే ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రి‌గా ప్రమాణం చేసిన డేట్ కావడంతో దాన్నే ఫైనల్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X