twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్-మహానాయకుడు: మాకు వ్యతిరేకంగా ఉంటే ఊరుకోం, సెన్సార్ బోర్డులో అనుకూలంగా లేడీ?

    |

    'ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రాన్ని మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనను ఈ చిత్రంలో విలన్‌గా చూపిస్తే ఊరుకునేది లేదని తెలిపారు. తాను ఎవరినీ వెన్నుపోటు పొడవలేదని, తననే వెన్ను పోటు పొడిచారని ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది... ఈ చిత్రంలో నాదేండ్ల భాస్కర్ రావును విలన్‌గా చూపించబోతున్నారనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ప్రజలను మభ్యపెట్టి డబ్బులు జేబులో వేసుకోవడమే

    ప్రజలను మభ్యపెట్టి డబ్బులు జేబులో వేసుకోవడమే

    సినిమా అంటేనే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించడం. కళ లాగా ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టి డబ్బులు జేబులో వేసుకోవడమే. అందుకే సినిమాకు నా లాంటి రాజకీయ నాయకులం ప్రాధాన్యత ఇవ్వబోమని నాదేండ్ల భాస్కర్ రావు తెలిపారు.

    లీగల్ నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు

    లీగల్ నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు

    ‘ఎన్టీఆర్-మహానాయకుడు'పై నా కుమారుడు నోటీస్ ఇచ్చారు. మా నాన్నను బ్యాడ్‌గా చూపిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మా లాయర్లు సెన్సార్ బోర్డుకు నోటీస్ ఇచ్చినా.. మమ్మల్ని పిలవలేదు. కనీసం ఫోన్ అయినా చేయకుండానే ‘ఎన్టీఆర్-మహానాయకుడు'కు పర్మిషన్ ఇచ్చారని భాస్కర్ రావు తెలిపారు.

    సెన్సార్ బోర్డులో అనుకూలంగా ఎవరో లేడీ ఉన్నారట

    సెన్సార్ బోర్డులో అనుకూలంగా ఎవరో లేడీ ఉన్నారట

    సెన్సార్ బోర్డ్ ఆలిండియా లెవల్‍‌లో ఇందులో యాక్ట్ చేసే అమ్మాయి ఎవరో మెంబర్‌గా ఉన్నట్లు మా లాయర్లకు తెలిసింది. ఆమె ఏది చెబితే వారు అది చేస్తారట. రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమా చేశారు. ఆ సినిమాకు పర్మిషన్ ఇవ్వకుండా వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. వారిలా మనమూ స్టే తీసుకోవచ్చు కదా అని లాయర్లను అడిగితే వాళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి తెచ్చుకోగలిగారు. మనం అధికారంలో లేము కనుక రిట్ వేసినా రాకపోవచ్చన్నారు. అందుకే నేను కూడా దీన్ని లైట్ తీసుకున్నాను. ప్రజలే సినిమా చూసి ఏది నిజం, ఏది అబద్దం అనేది నిర్ణయించుకుంటారని నాదేండ్ల భాస్కర్ రావు తెలిపారు.

    ఎన్టీఆర్-మహానాయకుడు

    ఎన్టీఆర్-మహానాయకుడు

    క్రిష్ దర్శకత్వం వహించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బయోపిక్ రెండో భాగమైన ‘ఎన్టీఆర్-మహానాయకుడు'పూర్తిగా ఎన్టీ రామారావు రాజకీయ జీవితాన్ని ఫోకస్ చేస్తూ సాగుతుంది. ఆయన పార్టీ స్థాపించడం మొదలు... ముఖ్య మంత్రి పదవి చేపట్టడం, ఆతర్వాత ఎదుర్కొన్న రాజకీయ పరిణామాలు ఇందులో చూపించనున్నారు.

    English summary
    Nadendla Bhaskara Rao made it clear that they will not keep quiet if they show his character in a poor light in the movie NTR Mahanayukudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X