twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు సినిమాలో...పవర్ స్టార్ అత్త

    By Bojja Kumar
    |

     Nadhiya
    హైదరాబాద్: 'మిర్చి' సినిమాలో ప్రభాస్ అమ్మ పాత్రలో, 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించి అదరగొట్టిన నటి నదియా....ఇపుడు మహేష్ బాబు 'ఆగడు' సినిమాలనూ నటించబోతోంది. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆమె మహేష్ బాబు అక్క పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందిన సమాచారం.

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 2011లో వచ్చిన 'దూకుడు' మంచి వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో చిత్రం ఆగడు.

    దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

    ఎంటర్టెన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'దూకుడు' చిత్రానికి డబల్ డోస్‌లా ఉంటుందని శ్రీను వైట్ల ఇప్పటికే స్పష్టం చేసారు. అందుకు తగిన విధంగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసిన వేసవి కానుకగా సినిమాను వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Actress Nadhiya who impressed Telugu audiences with her captivating performance in Mirchi and Attarintiki Daredi films have signed up a new movie Aagadu. Nadhiya will be playing the role of Super Star Mahesh Babu’s sister in the movie, as per the sources reports.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X