పవన్ కళ్యాణ్ అత్త పాత్ర చేయనున్న ప్రభాస్ మదర్!

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మదర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అత్తగా వెండితెరపై కనిపించబోంది. ఒక్క నిమిషం ఆగండి... కొంతీసి ప్రభాస్ రియల్ మదర్ సినిమాల్లో నటిస్తుందని మాత్రం అనుకోవద్దు. ప్రభాస్ లేటెస్ట్ హిట్ 'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాలో నటించబోతోంది. ఈ చిత్రంలో నదియా హీరోయిన్ సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. నదియా 1988 లో 'బజార్ రౌడీ' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఆమె పెళ్లి తర్వాత తెలుగు తెరకు దూరమై మళ్లీ మిర్చి చిత్రంలో దర్శనం ఇచ్చింది.

ఈచిత్రం సెకండ్ షెడ్యల్ ఈ రోజు (మార్చి 1) నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' మూవీ మంచి కామెడీ పండించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి.

ఈ సినిమా పూర్తయిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ న్యాయ శాస్త్రంలోని అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X