అఖిల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన నాగ్
హైదరాబాద్: మా మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. గ్రీకువీరుడు, తడాఖా ఆడియో వేడుకలకు అభిమానులు వచ్చారు. ఇప్పుడు 'అడ్డా'కు వచ్చారు. వచ్చే ఏడాది జరిగే అఖిల్ సినిమా పాటల వేడుకకు ఇలాగే వస్తారు అంటూ నాగార్జున 'అడ్డా' ఆడియో పంక్షన్ లో స్టేజ్ పై చెప్పారు. దాంతో వచ్చే సంవత్స రం ఖచ్చితంగా అఖిల్ ఎంట్రీ ఉంటుందని తేలిపోయింది.
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవడానికి ముందు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి...తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగు పరుచుకుంటున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ బాబు కూతురు నిహారిక కూడా నటిస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు మంచి పేరొస్తే వీరిద్దరు జంటగా సినిమా తెరకెక్కే అవకాశం ఉందంటున్నారు.
నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం'జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆమోదించదగ్గ సబ్జెక్టు, స్క్రీన్ ప్లేను ఓ సీనియర్ దర్శకుడుతో రెడీ చేయిస్తున్నాడని టాక్.


Click it and Unblock the Notifications












