మరోసారి 'అరుంధతి' తరహా పాత్రలో అనుష్క
అనుష్కకి అరుంధతి చిత్రం ఇచ్చిన కిక్ అలాంటిది..ఇలాంటిది కాదు. దాంతో ఆమెకు అన్నీ ఆ తరహా పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వాటిల్లో చాలా వరకూ రిజెక్టు చేసి పంచాక్షరి చేసింది. ఇప్పుడు మళ్ళీ ఢమురుకం చిత్రం చేస్తోంది. ఇందులో ఆమె పాత్రం మాయలు మంత్రాలుతో సాగుతుంది. అలాగే ఈ చిత్రంలో నాగార్జున హీరోగా చేస్తున్నారు. దాంతో రగడ చిత్రంలో కనపించిన అనుష్క, నాగార్జున జంట మరోసారి వెండితెరను పలకరించనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో శ్రీనివాసరెడ్డి ఈ ఢమురుకం చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ ఢమురుకం చిత్రాన్ని శ్రీనివాస రెడ్డి తీర్చిదిద్దనున్నారు. అలాగే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ చిత్రానికి మొదట్లో ఇలియానా పేరు పరిశీలించినప్పటికీ నాగార్జున పట్టుబట్టడంతో అనుష్కనే ఈ చిత్రంలోకి తీసుకున్నారు.అనుష్క కూడా అనేక తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా వున్నప్పటికి నాగ్‌కు, ఆమెకు వున్న ప్రత్యేక స్నేహంతో డేట్స్ అడ్జెస్ట్ చేశానని చెప్తోంది. అంతేకాదు. 2005లో నాగ్ హీరోగా రూపొందిన సూపర్ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన అనుష్క ఈ చిత్రం తర్వాత ఆయనతో కలిసి డాన్, రగడ చిత్రాలు చేశారు. వీటితో పాటు కింగ్, కేడీల్లో కూడా అతిథిగా ప్రత్యేక పాటల్లో కనిపించారు. అతి త్వరలోనే ఢమురుకం చిత్రం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











