twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ అశ్విన్‌కు ఏమైంది.. ఇలాంటి ఐడియాలెందుకు వస్తున్నాయ్.. నెటిజన్స్ అసహనం

    |

    మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అంతటి గొప్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నాగ్ అశ్విన్.. తన ట్వీట్లతో చులకన అవుతున్నాడు. ఈ మేరకు థియేటర్స్‌లో మద్యం అమ్మితే ఎలా ఉంటుందని అభిప్రాయాన్ని సేకరించగా.. తాజాగా మరో ట్వీట్ చేశాడు. థియేటర్స్‌లో డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తే ఎలా ఉంటుందని నెటిజన్లకు ప్రశ్న విసిరాడు. కార్లలోనే ఉండి సినిమా చూసే విధానంపై నాగ్ అశ్విన్ వేసిన ట్వీట్‌పై నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Mahanati Director Nag Ashwin On Liquor Selling In Theatre & Multiplexes
    థియేటర్స్‌లో మద్యం..

    థియేటర్స్‌లో మద్యం..

    నాగ్ అశ్విన్ రెండ్రోజుల క్రితం చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అయింది. అందులోని సారాంశం ఏంటంటే.. ‘సురేష్ బాబు గారు రానాతో ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. విదేశాల మాదిరి ఒకవేళ థియేటర్స్ గనుక మద్యాన్ని అమ్మే లైసెన్స్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. అయితే అది ఆదాయాన్ని పెంచుతుందా? అలాంటప్పుడు థియేటర్స్ బిజినెస్ ఎలా ఉంటుంది? మీరేం ఆలోచిస్తున్నారు? ఇది మంచి ఐడియానా? చెడ్డ ఐడియానా?' అని ట్వీట్ చేశాడు.

    అవును అది నిజమే..

    అవును అది నిజమే..


    కాసేపటికే నెటిజన్లు విపరీతంగా స్పందించారు. వాటిపై నాగ్ అశ్విన్ మరో ట్వీట్ చేస్తూ.. ‘అవును నిజమే.. ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యే అవకాశం ఉంది.. అయితే కొన్ని మల్టీప్లెక్స్‌లో మాత్రమే పెడితే పర్లేదు కదా..అది పూర్తిగా ఓ పరిష్కారం కాదనుకోండి.. మరి ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడానికి ఏం చేయాలి?ఆడియెన్స్‌ పెరగాలంటే ఏం చేయాలి? థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు వస్తారా? లేదా కొన్ని రోజులు ఆగి వస్తారా?' అని ప్రశ్నించాడు.

    డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్..

    డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్..


    తాజాగా నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ..‘థియేటర్స్‌లో డ్రైవ్ ఇన్.. అవుట్ డోర్ కార్, బైక్ పార్క్ చేసుకుని సినిమా చూడడం.. పాత కాలం టూరింగ్ టాసిస్ లాగా.. అల్రెడీ రిలీజ్ అయిన మూవీస్, క్లాసిక్స్, ఫేవరేట్స్.. మీరు మళ్లీ అలా చూడాలని అనుకుంటున్నారా? ఏ భాషలోని చిత్రాలైనా? అని ట్వీట్ చేశాడు.

    నెటిజన్స్ అసహనం..

    నెటిజన్స్ అసహనం..

    అలా ఎందుకు చూస్తారు? అలాంటి కాన్సెప్ట్‌ పెడితే చెడుకే ఎక్కువగా వాడుకుంటారు. క్లోజ్డ్ థియేటర్లో చూస్తేనే ఫీలింగ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. మీ సినిమాలు చూసి జీనియస్ అనుకున్నా కానీ మీ సినిమాలకు మీరు పెట్టే ట్వీట్స్‌కు సంబంధం లేదని ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు.

    అందరూ ఆ క్లాసికే ఓటు..

    అందరూ ఆ క్లాసికే ఓటు..


    ఇక చాలా మంది నాగ్ అశ్విన్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా మాయాబజార్ చిత్రాన్ని అలా చూడాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆపై జగదేక వీరుడు అతిలోక సుందరి, బాహుబలి వంటి సినిమాలు చూస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Nag Ashwin About Drive In Theaters. He Says That What do you think about drive-in theaters...outdoor car/bike park chesukoni cinema choodadam, paata kaalam touring talkies laga?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X