ప్రభాస్‌కు అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు.. నాగ్ అశ్విన్ కామెంట్స్ వైరల్
తెరపై ప్రభాస్ ఎలా ఉన్నా, కనిపించినా కూడా తెర వెనుక మాత్రం ఎంతో సైలెంట్. ఎంతో అవసరం ఉంటే తప్పా మాట్లాడడు. ఎంతటి స్టార్డం వచ్చినా కూడా ఒదిగి నడుచుకుంటాడు. ప్రభాస్ ఇతర విషయాల గురించి ఏమీ పట్టించుకోడని, కేవలం సినిమాలే ధ్యాసగా ఉంటాడని దర్శక నిర్మాతలు చెబుతుంటారు. తాజాగా మరోసారి నాగ్ అశ్విన్ కూడా అలాంటి కామెంట్లు చేశాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ తన జాతిరత్నాలు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

నిర్మాతగా మారి..
నాగ్ అశ్విన్ ఇప్పుడు నిర్మాతగా మారి జాతి రత్నాలు అనే సినిమాను తీసుకొస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అలా పరిచయం..
జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్‌ను ఓ షార్ట్ ఫిలిం చూసి అప్రోచ్ అయ్యాను. అలా జాతి రత్నాలు ప్రయాణం మొదలైంది. మధ్యలో నేను కూడా కొన్ని కరెక్షన్స్ చెప్పాను. ఇక టైటిల్ గురించి మూడు ఆప్షన్స్ ఇచ్చాడు.. అందులో జాతి రత్నాలు అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యామని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

అలా లైన్‌లోకి..
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సమయంలోనే నవీన్ పొలిశెట్టిని కలిశాం.. ఈ జాతిరత్నాలు కథ చెప్పాం.. అలా మొదటగా నవీన్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు. ఆ తరువాత రాహుల్, ప్రియదర్శి వచ్చారు. మామూలుగా అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను నవీన్, విజయ్ దేవరకొండలతో కలిసి తీయాలని అనుకున్నట్టు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ప్రభాస్ గురించి..
నాగ్ అశ్విన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడూ కూడా సినిమా రేంజ్ ఏంటి.. బిజినెస్ ఏంటి.. కలెక్షన్లు ఏంటి అనే వాటి గురించి పట్టించుకోరు.. ఇక సోషల్ మీడియాపై అంతగా ఆసక్తి కూడా ఉండదు.. ఎప్పుడైనా కలిస్తే మా ప్రాజెక్ట్ గురించి, ఆయన చేసే ఇతర సినిమా కథల గురించి మాత్రమే చర్చిస్తుంటాడని చెప్పుకొచ్చాడు.

భారీ ప్రాజెక్ట్..
నాగ్ అశ్విన్ ప్రభాస్ మూవీ టైమ్ మిషన్ నేపథ్యంలో ఉంటుందని, భవిష్యత్తులోకి తీసుకెళ్లే మరో అద్భుతమైన ప్రపంచాన్ని చూపించబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభమై.. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకులకు ముందు రానున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











