థియేటర్స్‌లో మద్యం అమ్మకం.. మంచి నిర్ణయామా? కాదా?.. నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మహానటి సావిత్రి జీవితాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి.. అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మహానటి సావిత్రికి నిజమైన నివాళిగా 'మహానటి'ని తెరకెక్కించాడని యావత్ సినీ లోకం నాగ్ అశ్విన్‌ను కొనియాడింది. ఎన్ని సినిమాలు తీశామన్నది కాదు.. ఎంతమంది చెప్పుకునేలా తీశామన్నదే నాగ్ అశ్విన్ ఫార్మూలా అన్నట్టు కనిపిస్తోంది. అందుకే మహానటి విడుదలై రెండేళ్లు అయినా.. మరో ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు.
Recommended Video

ప్రభాస్‌తో అంతర్జాతీయ చిత్రం..
మహానటి తరువాత ఎలాంటి చిత్రాన్ని చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా కాదని, ప్రపంచ స్థాయిలో ఉంటుందని స్వయంగా నాగ్ అశ్వినే చెప్పుకొచ్చాడు.

కరోనా సమయంలో..
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఘోరంగా దెబ్బ తింది. షూటింగ్స్ లేక, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడం, థియేటర్స్ మూసి వేయడంతో సినీ రంగం మొత్తం కుదేలైంది. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ ఓ ప్రతిపాదన చేశాడు. దానిపై నెటిజన్స్ సలహాలను అడిగాడు.

థియేటర్స్‌లో మద్యం..
ఈ మేరకు నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. ‘సురేష్ బాబు గారు రానాతో ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. విదేశాల మాదిరి ఒకవేళ థియేటర్స్ గనుక మద్యాన్ని అమ్మే లైసెన్స్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది. అయితే అది ఆదాయాన్ని పెంచుతుందా? అలాంటప్పుడు థియేటర్స్ బిజినెస్ ఎలా ఉంటుంది? మీరేం ఆలోచిస్తున్నారు? ఇది మంచి ఐడియానా? చెడ్డ ఐడియానా?' అని ట్వీట్ చేశాడు.

చెత్త నిర్ణయం అంటూ సలహా..
థియేటర్స్‌లో మద్యం విక్రయిస్తే పరిస్థితి అదుపులో ఉండదని, ఒకవేళ అలా జరిగితే ఫ్యామిలీ ఆడియెన్స్ దూరం అవుతారని, థియేటర్ యాజమాన్యానికి లేనిపోని తలనొప్పులు వస్తాయని, విచ్చల విడిగా ప్రవర్తిస్తారని, ఇది చెత్త నిర్ణయమని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

అవును అది నిజమే..
కాసేపటి నాగ్ అశ్విన్ మరో ట్వీట్ చేస్తూ.. ‘అవును నిజమే.. ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యే అవకాశం ఉంది.. అయితే కొన్ని మల్టీప్లెక్స్‌లో మాత్రమే పెడితే పర్లేదు కదా..అది పూర్తిగా ఓ పరిష్కారం కాదనుకోండి.. మరి ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడానికి ఏం చేయాలి?ఆడియెన్స్ పెరగాలంటే ఏం చేయాలి? థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు వస్తారా? లేదా కొన్ని రోజులు ఆగి వస్తారా?' అని ప్రశ్నించాడు.


Click it and Unblock the Notifications











