ప్రభాస్ సినిమాపై నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్: అందుకే ఆలస్యం అంటూ సీక్రెట్ రివీల్ చేశాడు
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభం నుంచీ ఓ మోస్తరు సినిమాల్లో నటించిన అతడు.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు పట్టాలు కూడా ఎక్కించేశాడు. అయితే, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్టును చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసినా.. షూటింగ్ మొదలు పెట్టలేదు. దీంతో ఈ మూవీపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ కొన్ని సీక్రెట్లు రివీల్ చేశాడు. వివరాల్లోకి వెళితే...
యువ హీరోయిన్ గ్లామర్ ఫోటోషూట్.. లేత సొగసులను అలా దాచేస్తూ..

రెండు చిత్రాలతో యూనివర్శల్ స్టార్‌గా
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో 'సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నిరాశ పరిచిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు బద్దలు కొట్టింది.

మొదటిసారి అలాంటి మూవీలో ప్రభాస్
ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముందుగా ప్రకటించాడు.. స్టార్ట్ కాలేదు
'రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఓం రౌత్ రూపొందించనున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ ప్రకటించాడు. ఈ రెండింటినీ ఇప్పటికే మొదలెట్టాడు.

పాన్ వరల్డ్ సినిమా... అదే కాన్సెప్టుతో
నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చేసే సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తుండగా.. దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. ఇక, సినిమా కథ గురించి పలు ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. టైం మెషీన్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన 'ఆదిత్య 369'కు ఇది సీక్వెల్ అంటున్నారు. ఇది పాన్ వరల్డ్ మూవీగా వస్తుంది.

ప్రాజెక్టుపై నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్
సినిమాను ప్రకటించి చాలా కాలమే అవుతున్నా ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిపై కీలక విషయాలను వెల్లడించారు. 'ఈ సినిమా ఆలస్యం అవుతోందని.. దీని కోసం చాలా సమయం పెట్టాల్సి వస్తోందన్న భావన తనకు ఎంత మాత్రం లేదు. నిజానికి గ్యాప్ దొరకడంపై సంతోషంగా ఉంది' అని చెప్పాడు.

అందుకే ఆలస్యం అంటూ సీక్రెట్ రివీల్
ప్రభాస్ నటించబోయే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అన్న దానిపైనా నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. 'కరోనా నేపథ్యంలో సినిమా పట్టాలెక్కడానికి ఇంకొంత ఆలస్యం కావచ్చు. కానీ ఈ ఏడాదే ప్రారంభం అవుతుంది. ఇంకో విషయం ఏమిటంటే దీని కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. ఇందులో అన్నీ కొత్తగానే కనిపిస్తాయి' అంటూ అసలు మేటర్లు అన్నీ రివీల్ చేసేశాడు.


Click it and Unblock the Notifications











