ఆ సత్తా ప్రభాస్‌కు మాత్రమే ఉంది: డైరెక్టర్ నాగ్ అశ్విన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమాను 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాను ఇటీవలే అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి స్పందిస్తూ ఆసక్తికరంగా మాట్లాడారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

ఈ మేరకు తను రాసుకున్న కథలో హీరో పాత్ర పోషించే సత్తా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు తప్ప వేరెవరికీ లేదని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు నాగ్ అశ్విన్ తెలిపాడు.

Nag Ashwin Comments On Prabhas

తాను ఎంతో నేర్చుకుని, చాలా విషయాలు తెలుసుకుని ఓ సైన్స్ ఫిక్షన్ కథ రాసుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఆ కథకు హీరోగా ప్రభాస్ మాత్రమే సరిపోతాడనిపించిందని, మార్కెట్ లెక్కల కోసం మాత్రమే కాదు.. ఆ పాత్రను పోషించగలిగే సత్తా ప్రభాస్‌కు తప్ప ఇంకెవరికీ లేదనిపించే ఈ సినిమాలో ప్రభాస్ ని హీరోగా తీసుకున్నామని చెప్పాడు.

తన కథ విని ప్రభాస్ షాకయ్యాడని, ఇది పూర్తి కమర్షియల్ సినిమా అని అన్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుందని నాగ్ అశ్విన్ చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X