twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేరే లెవెల్‌ ప్లాన్.. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాకు అలాంటి వారు కావాలంటా!

    |

    ప్రస్తుతం ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అన్నింటి కంటే ఆలస్యంగా సలార్ చిత్రాన్ని కన్ఫామ్ చేశాడు. కానీ దాన్నే ముందుగా మొదలుపెట్టేశాడు. కారణాలు ఏవైనా గానీ సలార్ పట్టాలెక్కింది. ఎప్పుడో ప్రకటించిన వైజయంతీ మూవీస్ బ్యానర్‌ మూవీ మాత్రం ఇంకా నత్తనడకనే సాగుతోంది. సినిమాకు సంబంధించిన మెయిన్ లీడ్, క్యాస్టింగ్ అంటూ అప్డేట్లతోనే కాలాం వెళ్లదీస్తున్నారు.

    Recommended Video

    Prabhas 21 : Nag Ashwin Repeats Mahanati Crew | Deepika Padukone | Prabhas
    ఆ అప్డేట్లతో రచ్చ..

    ఆ అప్డేట్లతో రచ్చ..

    ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన అప్డేట్‌లు ఇస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొణె నటిస్తున్నారంటూ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫర్‌గా మహానటి ఫేమ్ డాన్‌ను తీసుకున్నట్టు ప్రకటించారు.

    ప్రాజెక్ట్‌పై అంచనాలు..

    ప్రాజెక్ట్‌పై అంచనాలు..

    మహానటి వంటి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో దర్శకుడిగా నాగ్ అశ్విన్ పేరు మార్మోగిపోయింది. అందుకే నాగ్ అశ్విన్ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్నామని ప్రకటించడంతోనే అంచనాలు పెరిగాయి. అయితే ఇది పాన్ ఇండియా కాదని పాన్ వరల్డ్ అంటూ నెటిజన్ల కామెంట్లకు డైరెక్టర్ రిప్లైలు ఇవ్వడంతో మరింత హైప్ పెరిగింది.

    కథ అలా లీక్..

    కథ అలా లీక్..

    మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్‌ను పరిచయం చేస్తూ నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌లు అసలు కథ లీకైంది. మహానటి సినిమాలో గతాన్ని ప్రపంచానికి చూపించాం.. ఈసారి భవిష్యత్తులోంచి మరో ప్రపంచాన్ని క్రియేట్ చేద్దామని తెలిపాడు. అంటే అది టైం మిషన్ కథ అని అందులోనే భవిష్యత్తులోకి వెళ్తారని అర్థమవుతోంది.

    తాజాగా ఇలా..

    తాజాగా ఇలా..

    నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో భారీ క్యాస్టింగ్ అవసరమని తెలుస్తోంది. అందుకే పెద్ద మొత్తంలో కొత్త నటీనటులు కావాలంటూ తాజాగా క్యాస్టింగ్ కాల్‌‌ అంటూ ఆహ్వానించారు. ఈ క్రమంలో కొన్ని లక్షణాలుండాలని కండీషన్స్ పెట్టారు.

    మార్షల్ ఆర్ట్స్..

    మార్షల్ ఆర్ట్స్..

    9 నుంచి 14 ఏళ్లు ఉండే అమ్మాయిలు కావాలంట. యంగ్ ఫన్నీ క్యూరియస్ ఎనర్జిటిక్ డ్యాన్సర్స్ జిమ్నాస్టిస్ కావాలంటూ తెలిపారు. అంతే కాకుండా 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండే మేల్ యాక్టర్స్ కావాలని ప్రకటించారు. డ్యాన్సర్, మార్షల్ ఆర్టిస్ట్స్ కూడా కావాలంట. పొడుగ్గా, మంచి శరీర ధారుడ్యం కలిగి యుద్దానికి వెళ్లే యోధుల్లా ఉండాలట. ఎలా కావాలంటే అలా శరీరాన్ని, మనుసును మార్చుకునేవారు కావాలంట. అంటే ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్‌లు బాగానే ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది.

    English summary
    Nag ashwin Prabhas Movie casting call, Mickey J Meyer About Nag ashwin Prabhas Movie..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X