నాగశ్విన్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. కృష్ణుడి పాత్రపై అలాంటి కామెంట్
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర అందులోని మన తెలుగు సినిమా నుంచి పురాణాల నేపథ్యంలో చిత్రాలు వస్తున్నా చిత్రాలు చూస్తూనే ఉన్నాం. దైవత్వానికి సంబంధించి సాలిడ్ కంటెంట్ పట్టుకొని మేకర్స్ చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు దీనితో ఈ సినిమాలకి ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండగా ఈ తరహా సినిమాలకి మరింత డిమాండ్ కూడా నెలకొంటుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ రకమైన సినిమాలో ఆయా పాత్రలకి సంబంధించి కాస్టింగ్ కూడా ఎంతో ప్రధానం కాగా ఆ పవర్ఫుల్ పాత్రల్లో ఏ హీరో అయితే సెట్ అవుతాడో దాని బట్టి ఆ పాత్ర తాలూకా ఇంపాక్ట్ కూడా అదే రేంజ్ లో ఆడియెన్స్ లోకి వెళుతుంది. కాగా ఈ నేపథ్యంలో వచ్చి ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బాగా హాట్ టాపిక్ గా మారుతున్న ఆ సినిమానే "కల్కి 2898 ఎడి".

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని మహా భారతం నేపథ్యంని మెయిన్ ఫా తీసుకోగా అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకొని సాలిడ్ కాస్టింగ్ తో సినిమాని రూపొందించాడు. కాగా ఇదిలా ఉండగా కర్ణ పాత్రకి యూనానిమస్ గా ప్రభాస్ కి రెస్పాన్స్ రాగా ఈ తర్వాత అర్జునుడి పాత్రకి విజయ్ దేవరకొండ కూడా సెట్ అయ్యాడు కానీ కొంచెం నెగిటివిటీ వచ్చింది.
అయితే ఈ ఇద్దరితో పాటుగా మరో సర్ప్రైజింగ్ రోల్ శ్రీకృష్ణ పాత్ర అసలు ముఖం కనిపించకుండా కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ విషయంలో నాగ్ అశ్విన్ తన బ్రిలియెన్స్ ని చూపించాడు కానీ అక్కడ నుంచి పార్ట్ 2లో ముఖాన్ని రివీల్ చేయాల్సి వస్తే ఎవరిని పెడతారు అనేది మరింత క్రేజీ అంశంగా మారింది. అయితే ఈ రోల్ ని నాని చెయ్యాలని, మహేష్ బాబు చెయ్యాలని ఎవరూ కాదు ప్రభాసే అని ప్రభాస్ అభిమానులు ఫిక్స్ అయ్యిపోయారు.

అయితే ఈ చిత్రంలో కృష్ణుడిగా మాత్రం మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ తో పాటుగా న్యూట్రల్ ఆడియెన్స్ లో కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై నాగశ్విన్ చేసిన కామెంట్స్ మాత్రం ప్రభాస్ అభిమానులకి బాగా కోపం తీసుకొస్తున్నాయి. కృష్ణుడిగా మహేష్ బాబు నెక్స్ట్ సినిమాలో కనిపిస్తారా అనేదానికి నిర్మొహమాటంగా మహేష్ గారు కృష్ణుడిగా వేరే సినిమాలో బాగుంటారు ఏమో కానీ మా సినిమాలో కాదు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
దీనితో ఇది విన్న మహేష్ బాబు అభిమానులు మాత్రం నాగి విషయంలో చాలా ఫైర్ గా ఉన్నారు. మహీశా సూట్ అవ్వడం అవ్వకపోవడం పక్కన పెడితే నాగి ఈ రీతిలో సమాధానం ఇవ్వడం అనేది మాత్రం మహేష్ అభిమానులని మరింత ఆగ్రహానికి లోను చేసింది. ఈ కామెంట్స్ మూలాన మహేష్ ఫ్యాన్స్ ని ఇతర అభిమానులు కూడా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా మొత్తంగా అయితే నాగ్ అశ్విన్ కామెంట్స్ మాత్రం మహేష్ అభిమానులకి ఇప్పుడు నచ్చలేదు. మరి దీనిపై నాగి ఏమన్నా వివరణ ఇస్తాడో లేక కూల్ గా లైట్ తీసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











