ప్రభాస్ ఒక్కడి కోసం 500కోట్లు.. ఆ దర్శకుడు రాజమౌళిని అందుకోగలడా?
రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా బాక్సాఫీస్ ఎకౌంట్స్ ని అయితే బాగానే తెరిచాడు. ప్రభాస్ కి మంచి మార్కెట్ సెట్టయిందని చెప్పవచ్చు. ఇక సాహో సినిమాతో ముందు సినిమాల రికార్డులను మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు. కానీ బాహుబలి లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తే ప్రభాస్ తప్పకుండా మరొక బిగ్ సక్సెస్ అందుకుంటాడని చెప్పవచ్చు.

అలా అనిపించడం లేదు..
సాహో సినిమా నార్త్ లో తప్పితే సౌత్ లో ఎక్కడా కూడా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేలకపోయింది. బయ్యర్లకు భారీగా నష్టాలు తేవడంతో దాదాపు బిగ్ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం ప్రభాస్ ఎంచుకుంటున్న సినిమాలను చూస్తే అలా అనిపించడం లేదు. రీసెంట్ గా ఒప్పుకున్న సినిమాలు కూడా హై బడ్జెట్ లో రూపొందుతున్నవే.

అన్ని బిగ్ బడ్జెట్ సినిమాలే..
కొన్నాళ్ళు కనీసం 100కోట్ల సినిమాను కూడా టచ్ చేయకూడదని అనుకున్న ప్రభాస్ ఇప్పుడు అంతకంటే డబుల్ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ముందు నుంచి 150కోట్లు అనుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆ లెక్కలు 200కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా అంతకంటే ఎక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారట.

అంతకు మించి..
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ 21వ ప్రాజెక్ట్ వైజయంతి మూవీస్ లో రూపొందనుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ పై ఇప్పుడు అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి 500కోట్ల వరకు ఖర్చు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అశ్వినీదత్ దర్శకుడిపై నమ్మకంతో RRR కంటే హై రేంజ్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Recommended Video

రాజమౌళిని అందుకోగలడా?
బాహుబలి సినిమా సక్సెస్ కావడానికి రాజమౌళి ప్రధాన కారణమని అందరికి తెలిసిందే. అయితే ఆ దర్శకుడి స్థాయిలో నాగ్ అశ్విన్ ప్రభాస్ 21వ సినిమాకు న్యాయం చేయగలడా అనే సందేహం కలుగుతోంది. రాజమౌళి తన అనుభవంతో 450కోట్ల సినిమాను కరెక్ట్ గా ఆడియెన్స్ ముందు నిలబెట్టగలడని అందరికి ఒక నమ్మకం అయితే ఉంది. కానీ ఇప్పటివరకు కనీసం 100కోట్ల సినిమా చేయలేని నాగ్ అశ్విన్ 500కోట్ల బిగ్ బడ్జెట్ ని హ్యాండిల్ చేయగలడా అనే సందేహం కలుగుతోంది. నిర్మాత అశ్వినీదత్ అంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











